*ప్ర‌తి విద్యార్థి హ‌రిత రాయ‌బారులుగా మారాలి – క‌మిష‌న‌ర్ డా.జ‌నార్థ‌న్‌రెడ్డి*

Spread the love

*ప్ర‌తి విద్యార్థి హ‌రిత రాయ‌బారులుగా మారాలి – క‌మిష‌న‌ర్ డా.జ‌నార్థ‌న్‌రెడ్డి*
*ఎల్బీన‌గ‌ర్ జెడ్‌.పి.పాఠ‌శాల‌లో మొక్క‌లు నాటిన క‌మిష‌న‌ర్‌*

త‌మ నివాసాలు, కాల‌నీల్లో పెద్ద ఎత్తున మొక్క‌లు నాటించేందుకు హ‌రిత రాయ‌బారులుగా మారాల‌ని విద్యార్థినీవిద్యార్థుల‌కు జీహెచ్ఎంసీ క‌మిష‌న‌ర్ డా.బి.జ‌నార్థ‌న్‌రెడ్డి పిలుపునిచ్చారు. ఎల్బీన‌గ‌ర్‌లోని జిల్లా ప‌రిష‌త్ ఉన్న‌త పాఠ‌శాల‌లో హ‌రిత‌హారంలో భాగంగా మొక్క‌లు నాటి విద్యార్థినీవిద్యార్థుల‌ను ఉద్దేశించి ప్ర‌సంగించారు. న‌గ‌రాన్ని హ‌రిత‌మ‌యంగా చేయ‌డానికి జీహెచ్ఎంసీ 35ల‌క్ష‌ల మొక్క‌లు ఉచితంగా పంపిణీ చేస్తుంద‌ని, ఈ అవకాశాన్ని పూర్తిస్థాయిలో వినియోగించుకొని మొక్క‌ల‌ను త‌మ నివాసాలు, ప‌రిస‌ర ప్రాంతాలు, కాల‌నీల‌లో నాట‌డంతో పాటు వాటి ప‌రిర‌క్ష‌ణ బాధ్య‌త‌లను స్వీక‌రించాల‌ని తెలిపారు. ప‌ర్యావ‌ర‌ణానికి హానికరంగా ఉన్న ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా త‌గ్గించ‌డంతో పాటు సింగిల్‌యూజ్ ప్లాస్టిక్‌ను నిషేదించాల‌ని త‌మ‌ కుటుంబ స‌భ్యుల‌ను చైత‌న్య ప‌ర్చాల‌ని కోరారు. అదేవిధంగా కూర‌గాయాలు, చికెన్‌, మ‌ట‌న్ షాపుల‌కు వెళ్లేట‌ప్పుడు త‌ప్ప‌నిస‌రిగా చేతి సంచుల‌తో పాటు టిఫిన్ బాక్స్‌ల‌ను తీసుకెళ్లాల‌ని కోరారు. స్వ‌చ్ఛ‌త‌పై పూర్తిస్థాయి అవ‌గాహ‌న పొందేందుకు పాఠ‌శాల‌లోని ప్ర‌తి త‌ర‌గ‌తిలో స్వ‌చ్ఛ‌త క‌మిటీల‌ను ఏర్పాటు చేయాల‌ని పేర్కొన్నారు. ఈ సంద‌ర్భంగా స్వ‌చ్ఛ‌త‌పై నిర్వ‌హించిన పోటీల్లో గెలుపొందిన విద్యార్థినీవిద్యార్థుల‌కు బ‌హుమ‌తుల ప్ర‌ధానం చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో జోన‌ల్ కమిష‌న‌ర్ శ్రీ‌నివాస్‌రెడ్డి, డిప్యూటి క‌మిష‌న‌ర్లు విజ‌య‌కృష్ణ‌, ముకుంద్‌రెడ్డి, కృష్ణయ్య‌, మెడిక‌ల్ ఆఫీస‌ర్లు మ‌ల్లికార్జున్‌, పాఠ‌శాల ప్ర‌ధానోపాద్యాయులు, ఉపాద్యాయులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*