*కంటివెలుగు విజ‌య‌వంతంలో కాల‌నీ సంక్షమ సంఘాల‌దే పాత్ర‌*

Spread the love

*కంటివెలుగు విజ‌య‌వంతంలో కాల‌నీ సంక్షమ సంఘాల‌దే పాత్ర‌*

గ్రేట‌ర్ హైద‌రాబాద్‌లో ఈ నెల 15వ తేదీ నుండి ప్రారంభం కానున్న కంటివెలుగు కార్య‌క్ర‌మాన్ని విజ‌య‌వంతం చేయ‌డంలో కాల‌నీ సంక్షేమ సంఘాలు ప్ర‌ధాన పాత్ర పోషించాలని డిప్యూటి మేయ‌ర్ బాబా ఫ‌సియుద్దీన్ తెలిపారు. కంటివెలుగు కార్య‌క్ర‌మం విజ‌య‌వంతం పై కాల‌నీ సంక్షేమ సంఘాల‌తో నేడు జీహెచ్ఎంసీ కార్యాల‌యంలో ప్ర‌త్యేక స‌మావేశాన్ని నిర్వ‌హించారు. జోన‌ల్ క‌మిష‌న‌ర్ భార‌తిహోలీకేరి, ర‌ఘుప్ర‌సాద్‌, శంక‌ర‌య్య‌, శ్రీ‌నివాస్‌రెడ్డి, అడిష‌న‌ల్ క‌మిష‌న‌ర్లు శృతిఓజాలు పాల్గొన్న ఈ స‌మావేశంలో బాబా ఫ‌సియుద్దీన్ మాట్లాడుతూ ఒకేసారి 4కోట్ల మందికి అంధ‌త్వ నివార‌ణ కార్య‌క్ర‌మంలో భాగంగా కంటి ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌డం, దేశంలోనే కాదు ప్ర‌పంచంలో మ‌రెక్క‌డా జ‌ర‌గ‌లేద‌ని అన్నారు. నేత్ర ప‌రీక్ష‌ల‌తో పాటు బిపి, షుగ‌ర్ లాంటి ప‌రీక్ష‌లు కూడా ఈ కంటి వెలుగు కార్య‌క్ర‌మం నిర్వ‌హించిన అనంత‌రంరం అవ‌స‌ర‌మైనవారికి కంటి అద్దాల‌ను అందించ‌డం జ‌రుగుతుంద‌ని పేర్కొ్న్నారు. ప్ర‌త‌రోజు ఒక్కో క్యాంపులో ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తార‌ని, ఏఏ రోజు ఎవ‌రెవ‌రు రావాల‌నే విష‌యంపై ముందుగానే వారికి ప్ర‌త్యేక ర‌షీదుల‌ను అంద‌జేస్తార‌ని తెలిపారు. త‌మ కాల‌నీలు, బ‌స్తీల్లో ఉన్న ప్ర‌తిఒక్క‌రిని ప్రిఒక్క‌రిని కంటివెలుగు కార్య‌క్ర‌మంలో ప‌రీక్ష‌లు నిర్వ‌హించుకునేలా కాల‌నీ సంక్షేమ సంఘాల బాధ్యులు కృషిచేయాల‌ని అన్నారు. జీహెచ్ఎంసీ అడిష‌న‌ల్ క‌మిష‌న‌ర్ భార‌తి హోలికేరీ మాట్లాడుతూ గ్రేట‌ర్ లో ఉన్న 150 వార్డుల్లో కోటికిపైగా జ‌నాభా ఉంద‌ని అన్నారు. వీరంద‌రికి నేత్ర‌ప‌రీక్ష‌లు నిర్వ‌హించేందుకు విస్తృత ఏర్పాట్లు చేప‌ట్టామ‌ని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*