*ఇ-ల‌ర్నింగ్ పూర్తిచేసిన ప‌దిమందికి న‌గ‌దు బ‌హుమ‌తులు*

0
1
Spread the love

*ఇ-ల‌ర్నింగ్ పూర్తిచేసిన ప‌దిమందికి న‌గ‌దు బ‌హుమ‌తులు*

స్వ‌చ్ఛ భార‌త్ మిష‌న్ ఘ‌న‌వ్య‌ర్థాల నిర్వ‌హ‌ణ‌పై ప్ర‌వేశ‌పెట్టిన ఇ-ల‌ర్నింగ్ కోర్సును పూర్తిచేసినవారికి లాట‌రీ ద్వారా ప‌దిమందికి ఒకొక్క‌రికి ప‌ది వేల రూపాయ‌ల‌ చొప్పున ల‌క్ష రూపాయ‌ల న‌గ‌దు బ‌హుమ‌తుల‌ను జీహెచ్ఎంసీ క‌మిష‌న‌ర్ డా.బి.జ‌నార్థ‌న్‌రెడ్డి ప్ర‌క‌టించారు. స్వ‌చ్ఛ‌త‌పై గ‌త జులై 31వ తేదీన స్వ‌చ్ఛ భార‌త్ మిష‌న్ ప్ర‌వేశ‌పెట్టిన ఇ-ల‌ర్నింగ్ కోర్సును 3,131 మంది పూర్తిచేశారు. ఈ ఇ-ల‌ర్నింగ్‌ను న‌గ‌ర‌వాసుల‌చే సాధ్య‌మైనంత ఎక్కువ మందిచే పూర్తిచేయించాల‌న్న ల‌క్ష్యంలో భాగంగా ఇ-ల‌ర్నింగ్ చేసిన‌వారికి ప్ర‌తినెల ప‌ది మందికి ప‌దివేల రూపాయ‌ల చొప్పున న‌గ‌దు బ‌హుమ‌తులు అందించ‌నున్న‌ట్టు క‌మిష‌న‌ర్ ప్ర‌క‌టించిన విష‌యం విదిత‌మే. నేడు జీహెచ్ఎంసీ ప్ర‌ధాన కార్యాల‌యంలో నిర్వ‌హించిన మెడిక‌ల్ ఆఫీస‌ర్ల స‌మావేశంలో లాట‌రీ ద్వారా ప‌ది మందిని ప్ర‌క‌టించారు. ttps://swifthcm.com/swachh-bharath/ అనే వెబ్‌సైట్ ద్వారా ఎవ‌రైనా ఇ-ల‌ర్నింగ్ కోర్సును పూర్తిచేయ‌వ‌చ్చున‌ని క‌మిష‌న‌ర్ పేర్కొన్నారు. ఇ-ల‌ర్నింగ్ పూర్తిచేసిన ప‌ది మందికి లాట‌రీ ద్వారా ఎంపికైన ఈ క్రిందివారికి ఒకొక్క‌రికి రూ. 10వేల న‌గ‌దు బ‌హుమ‌తి త్వ‌ర‌లోనే అందించ‌నున్న‌ట్టు ఆయ‌న తెలిపారు. విజ‌య్‌, డేవిడ్ జాన్స‌న్‌ గంట‌, మంజు, దీపికారెడ్డి, స‌య్య‌ద్ షాబాద్ హుస్సేన్‌, స‌య్య‌ద్ అహ్మ‌దుద్దీన్‌, పి.హేమ‌ల‌త‌, క‌డారి వ‌నిత‌, అర్బాజ్‌ ఖాన్‌, టి.య‌తేంద్ర‌మోహ‌న్‌లు ప‌ది వేల న‌గ‌దు బ‌హుమ‌తి గెలుపొందిన‌వారిలో ఉన్నారు.
* 2019 స్వ‌చ్ఛ స‌ర్వేక్ష‌ణ్‌కు స‌న్నద్దం కండి*
కేంద్ర స్వ‌చ్ఛ భార‌త్ మిష‌న్ ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హిస్తున్న స్వ‌చ్ఛ స‌ర్వేక్ష‌ణ్-2019కు స‌న్న‌ద్దం కావాల‌ని మెడిక‌ల్ ఆఫీస‌ర్ల‌కు జీహెచ్ఎంసీ క‌మిష‌న‌ర్ సూచించారు. 2018 స్వ‌చ్ఛ స‌ర్వేక్ష‌ణ్‌లో వ్య‌ర్థ ప‌దార్థాల నిర్వ‌హ‌ణ‌లో జీహెచ్ఎంసీ అగ్ర‌స్థానంలో నిలిచింద‌ని గుర్తుచేశారు. 2019లోనూ స్వ‌చ్ఛ న‌గ‌రంగా హైద‌రాబాద్‌ను నిలిపేలా ఇప్ప‌టి నుండే ప‌క‌డ్బందీ ప్ర‌ణాళిక‌తో ప‌నిచేయాల‌ని సూచించారు. న‌గ‌రంలో ఉన్న 2,296 స్వ‌చ్ఛ ఆటోల‌కు మైక్‌లు ఏర్పాటుచేసి స్వ‌చ్ఛ కార్య‌క్ర‌మాల‌పై న‌గ‌ర‌వాసుల‌ను చైత‌న్యం చేయాల‌ని కోరారు. ఈ స‌మావేశంలో అడిష‌న‌ల్ క‌మిష‌న‌ర్ శృతిఓజా, సాలిడ్‌వేస్ట్ మేనేజ్‌మెంట్ ఎస్‌.ఇ కోటేశ్వ‌ర‌రావు, మెడిక‌ల్ అధికారులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here