*హైకోర్టులో హ‌రిత‌హారం…పాల్గొన్న చీఫ్ జ‌స్టిస్ రాధాకృష్ణ‌న్‌*

0
1
Spread the love

*హైకోర్టులో హ‌రిత‌హారం…పాల్గొన్న చీఫ్ జ‌స్టిస్ రాధాకృష్ణ‌న్‌*

ఉమ్మ‌డి రాష్ట్రాల హైకోర్టులో జీహెచ్ఎంసీ ద్వారా నేడు నిర్వ‌హించిన హ‌రిత‌హారంలో ప్ర‌ధాన న్యాయ‌మూర్తి జ‌స్టిస్ టి.బి.రాధాకృష్ణ‌న్‌తో పాటు 24 మంది జ‌స్టిస్‌లు పాల్గొని మొక్క‌లు నాటారు. జీహెచ్ఎంసీ క‌మిష‌న‌ర్ డా.బి.జనార్థ‌న్‌రెడ్డి హాజ‌రైన ఈ కార్య‌క్ర‌మంలో చీఫ్ జ‌స్టిస్ రాధాకృష్ణ‌న్‌తో పాటు జ‌స్టిస్‌లు వేర్వేరుగా మొక్క‌లు నాటారు. అనంత‌రం ప్ర‌త్యేకంగా ఏర్పాటు చేసిన కార్య‌క్ర‌మంలో జ‌స్టిస్ రాధాకృష్ణ‌న్ ప‌లువురు అడ్వ‌కేట్‌లు, హైకోర్టు అధికారులు, సిబ్బందికి మొక్క‌లు పంపిణీ చేశారు. దాదాపు గంట‌సేపు కొన‌సాగిన ఈ హ‌రిత‌హారం కొన‌సాగింది. ఈ సంద‌ర్భంగా తెలంగాణ బార్ అసోసియేష‌న్ అధ్య‌క్షులు సి.దామోద‌ర్‌రెడ్డితో పాటు ప‌లువురు అసోసియేష‌న్ బాధ్యులు కూడా పాల్గొన్నారు. అడిష‌న‌ల్ క‌మిష‌న‌ర్ కృష్ణ‌, జోన‌ల్ క‌మిష‌న‌ర్ ర‌వికిర‌ణ్‌, అర్బ‌న్ బ‌యోడైవ‌ర్సిటీ డైరెక్ట‌ర్ దామోద‌ర్‌, జీహెచ్ఎంసీ స్టాండింగ్ కౌన్సిల్ సంప‌త్ ప్ర‌భాక‌ర్‌రెడ్డి, డిప్యూటి క‌మిష‌న‌ర్ అశోక్ సామ్రాట్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here