సింగోటం, సోమశిల ఎకో టూరిజం సర్క్యూట్ పనులను నెలాఖరులోగా పూర్తి చేయాలి

0
1
Spread the love

సింగోటం, సోమశిల ఎకో టూరిజం సర్క్యూట్ పనులను నెలాఖరులోగా పూర్తి చేయాలి
తెలంగాణాకే తలమానికంగా సింగోటం, సోమశిలను అభివృద్ధి చేద్దాం
సింగోటం ట్యాంక్‌బండ్, గార్డెనింగ్ డిజైన్‌పై అధికారులతో చర్చ
ప్రముఖ ఆర్కిటెక్ట్ నరేన్ గోయల్, టూరిజం ఎండీ మనోహర్‌తో మంత్రి జూపల్లి కృష్ణారావు సమీక్ష

హైదరాబాద్– తెలంగాణాకు తలమానికంగా సింగోటం, సోమశిలను అభివృద్ధి చేయాలని…ఈ ప్రాంతంలో పర్యాటక రంగ అభివృద్ధికి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. స్వదేశ్ దర్శన్ పథకంలో భాగంగా చేపడుతున్న సింగోటం, సోమశిల ఎకో టూరిజం సర్క్యూట్ పనులపై శనివారం సచివాలయంలో మంత్రి జూపల్లి కృష్ణారావు సమీక్ష నిర్వహించారు. దాదాపు 20 కోట్లతో సోమశిలలో…మరో 8 కోట్లతో సింగోటంలో జరుగుతున్న అభివృద్ధి పనుల పురోగతిని మంత్రి జూపల్లి కి టూరిజం ఎండీ మనోహర్ వివరించారు. దాదాపు 90 శాతం పనులు పూర్తి కావచ్చాయని…త్వరలోనే పనులన్నీ పూర్తి చేస్తామన్నారు. నిబంధనల మేరకు సకాలంలో పనులు చేయకపోతే కాంట్రాక్టర్‌ను బ్లాక్ లిస్టులో పెడతామని మంత్రి జూపల్లి హెచ్చరించారు. కాటేజీలు, ల్యాండ్ స్కేపింగ్, బోటింగ్‌తో పాటు హరిత గెస్ట్ హౌస్, హోటళ్ల నిర్మాణ పనులన్నీ నెలాఖరులోగా పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు. అలాగే సింగోటం చెరువును ట్యాంక్ బండ్‌గా అభివృద్ధి చేయడానికి రూపొందించిన ప్రణాళికలపై టూరిజం ఎండీ మనోహర్‌తో పాటు అహ్మదాబాద్‌కు చెందిన ప్రముఖ ఆర్కిటెక్టు నరేన్ గోయల్‌తోనూ మంత్రి చర్చించారు. వరదల అనంతరం తాను కేథారినాథ్ అభివృద్ధికి రూపొందించిన ప్లాన్‌ను మంత్రికి గోయల్ వివరించారు. విశాఖ, కాకినాడ బీచ్‌ల ప్లాన్‌ను కూడా తానే రూపొందించినట్లు ఆయన వివరించారు. అదే తరహాలో సోమశిల, సింగోటంలో అభివృద్ధి పరిచేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించి…తగు ప్రణాళికలు సిద్దం చేస్తానని ఆయన హామీ ఇచ్చారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here