బిసి ల సంక్షేమం కోసం 6 వేల కోట్లతో వివిధ పథకాలు

Spread the love

బిసి ల సంక్షేమం కోసం 6 వేల కోట్లతో వివిధ పథకాలు

రాష్ట్రంలో బిసి ల సంక్షేమం కోసం 2018-19 ఆర్ధిక సంవత్సరంలో దాదాపు 6 వేల కోట్లతో వివిధ పథకాల కోసం బిసి సంక్షేమ శాఖ ద్వారా ఖర్చు చేస్తున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.ఎస్.కె.జోషి తెలిపారు.
గురువారం సచివాలయంలో బిసి సంక్షేమ శాఖ ఉన్నతాధికారులతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీక్షించారు. ఈ సమావేశంలో బిసి వెల్ఫేర్ కార్యదర్శి బి.వెంకటేశం, బిసి వెల్ఫేర్ అడిషనల్ సెక్రటరీ వి.సైదా, బి.సి కార్పొరేషన్ యం.డి. కె.అలోక్ కుమార్, బిసి రెసిడెన్షియల్ స్కూల్స్ సెక్రటరి మల్లయ్య బట్టు, వాషర్ మెన్ ఫెడరేషన్ యం.డి యం.చంద్రశేఖర్, వడ్డెర కార్పొరేషన్ యం.డి. యం.బి.కె.మంజుల, బిసి స్టడీ సర్కిల్ డైరెక్టర్ జి.సుజాత తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సి.యస్ మాట్లాడుతూ బిసి విద్యార్ధుల మెయింటనెన్స్ ఫీజు కోసం 487 కోట్ల రూపాయలు, బిసి, ఈ బిసి ట్యూషన్ ఫీజు రీయంబర్స్ మెంట్ కోసం 1100 కోట్లు, మహాత్మాజ్యోతిభాఫూలే ఓవర్ సిస్ విద్యా నిధి కోసం 60 కోట్లు, కళ్యాణ లక్ష్మీకి 700 కోట్లు కేటాయించినట్లు తెలిపారు.
కళ్యాణ లక్ష్మీ ద్వారా ఈ ఆర్ధిక సంవత్సరంలో ఇప్పటి వరకు 46,250 మందికి సహాయం అందించామన్నారు. రాష్ట్రంలో 119 బిసి రెసిడెన్షియల్ పాఠశాలలు పని చేస్తున్నాయని ఆయన తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 450 ఫ్రీమెట్రిక్, 250 పోస్టుమెట్రిక్ హాస్టళ్శు పని చేస్తున్నాయని వీటిలో 1,34,000 మంది విద్యార్ధులు ఉన్నారన్నారు. బిసి విద్యార్ధులకు వివిధ పోటీ పరీక్షలలో పాల్గొని ఉద్యోగాలు పొందేలా స్టడీ సర్కిల్స్ పనిచేయాలని, ఐఏఏస్, గ్రూప్ -1, గ్రూప్ -1V లాంటి ఉద్యోగాలకు శిక్షణను అందించాలని ఆయన సూచించారు. స్కిల్ డెవలెప్ మెంట్ శిక్షణకై చొరవ తీసుకోవాలన్నారు. బి.సి రెసిడెన్షియల్ పాఠశాలల్లో ఎస్.ఎస్.సి, ఇంటర్ మీడియట్ లలో గత సంవత్సరంలో ఫలితాలు సాధించిన విధంగా ఈ సారి కూడా సిబ్భంది కృషి చేయాలన్నారు.

ఎకనామిక్ సపోర్టు స్కీం కు సంబంధించి ఇండివిజువల్, స్మాల్ స్కేల్ బిజినెస్ కు 50 వేలు పూర్తి సబ్సిడీగాను, అప్ గ్రేడేషన్ స్కిల్స్ కు సంబంధించి 80వేలు సబ్సిడీ, 20 వేలు లబ్దిదారుని వాటాగా చెల్లించాల్సి ఉంటుందని బిసి సంక్షేమ శాఖ కార్యదర్శి బి.వెంకటేశం సి.యస్ కు వివరించారు. వివిధ బిసి కార్పొరేషన్లకు సంబంధించి దాదాపు 5,76,000 కు పైగా ధరఖాస్తులు వచ్చాయని వీటిని గ్రౌండింగ్ చేయడానికి చర్యలు తీసుకుంటున్నట్టు ఆయన తెలిపారు. మహాత్మాజ్యోతిభాఫులే బిసి రెసిడెన్షియల్ స్కూళ్ళలో చదివిన ఇంటర్ విద్యార్ధులు ఐఐటి, ఎన్ఐటి (నీట్) ఐఐఐటి వంటి వివిధ ప్రముఖ ఇంజనీరింగ్ కళాశాలలో 18 సీట్లు పొందినట్లు ఆయన సి.యస్ కు వివరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*