కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త !.. కరవు భత్యాన్ని పెంపు

0
246
Spread the love

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త !.. కరవు భత్యాన్ని పెంపు

న్యూ దిలి జూలై 14 (ఎక్స్ ప్రెస్ న్యూస్ );దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న కరువు భత్యం చెల్లింపుపై కేంద్రం స్పందించింది. ఎటువంటి కోతలు లేకుండా ఉద్యోగులు ఊహించనట్టుగానే కరవు భత్యాన్ని పెంచింది. దీంతో  54 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు లబ్ధి చేకూరనుంది. 7వ వేతన ఒప్పందం సంఘం సిఫార్సులను కేంద్రం పరిగణలోకి తీసుకుంది. దీంతో ప్రస్తుతం ఉద్యోగులకు చెల్లిస్తున్న కరువు భత్యం (డియర్‌నెస్‌ అలవెన్స్‌ డీఏ)ను 17 శాతం నుంచి 28 శాతానికి పెంచుతూ నిర్ణయం తీసుకుంది. పెంచిన డీఏను 2021 నుంచి అమలు చేయనున్నారు. కరోనా కల్లోలం కారణంగా 2020 జనవరి నుంచి డీఏ పెంపు పెండింగ్‌లో ఉంది. ఇప్పటికే మూడు డీఏలు పెండింగ్‌లో ఉన్నాయి. మరోవైపు 2021 జులై నుంచి కొత్త డీఏను అమలు చేయాల్సిన బాధ్యత కేంద్రంపై పడింది. దీంతో ప్రభుత్వం డీఏ పెంచేందుకు అంగీకరించింది. మరోవైపు పెన్షనర్లకు సంబంధించి డీఆర్‌ పెంపుపై ఎటువంటి ప్రకటన రాలేదు. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here