గోమాత‌ను ఇలా సేవిస్తే…. న‌వ‌గ్ర‌హాల దోషాల‌ను ఇలా నివారించ‌వచ్చు

0
2027
Spread the love

భార‌త‌దేశంలో ప్రాధానంగా హిందువులు త‌మ‌కు ఎలాంటి స‌మ‌స్య‌లు వ‌చ్చినా…. జ్యోతిష పండితుల‌ను సంప్ర‌దించ‌డం ప‌రిపాటి. ప్ర‌ధానంగా 9 గ్ర‌హాల దోశాల నివార‌ణ‌కు ఏం చేయాలో వారిని అడిగి తెలుసుకుంటాము. ఏదైనా దోశం ఉన్న‌ట్టైతే… ఎంతైన ఖ‌ర్చు చేసి శాంతి ప్ర‌క్రియ‌లు చేయిస్తుంటాము. ఇలా వీటిపై న‌మ్మ‌కం ఉన్న వారు ఎప్పుడు జీవితంలో స‌మ‌స్య‌లు ఎదురైనా… జోతిష్యుల వ‌ద్ద‌కు వెళ్లి… త‌మ జాత‌కాలు చ‌క్రాలు వేయించి…. ఎంతో డ‌బ్బు ఖ‌ర్చు చేసి మ‌రీ వారి చెప్పిన‌ట్లు చేస్తుంటారు.

మ‌న‌కు తెలుసు మ‌న దేశీయ ఆవుల‌లో 33 కోట్ల దేవ‌త‌లు కొలువై ఉంటార‌ని. ఎలాంటి స‌మ‌స్య‌లు ఉన్నా… కేవ‌లం మ‌న దేశీయ ఆవుల‌ను పూజించి మ‌నం స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించుకోవ‌చ్చు అన్న‌ది మ‌నం మ‌ర్చిపోయాం. ఏ గ్ర‌హ స‌మ‌స్య‌ ఉన్నా… కేవ‌లం ఆవును ఆశ్ర‌యించి…. చేసే పూజ‌ల వ‌ల్ల మంచి ఫ‌లితాలు ఉంటాయి… అదే విధంగా డబ్బు కూడా ఖ‌ర్చు కాదు. మ‌నం ఇక్క‌డ గ‌మ‌నించాల్సిన విష‌యం ఏమిటంటే.. కేవ‌లం మ‌న దేశీయ ఆవుకు సేవ చేయ‌డం వ‌ల్ల‌… అన్ని గ్ర‌హాల‌ను శాంత‌ప‌ర్చ‌వ‌చ్చు. మ‌నం అలా చేయడానికి డ‌బ్బులు ఏమీ ఖ‌ర్చు కావు. అవి చిన్న చిన్న ఉపాయాలు మాత్ర‌మే. అస‌లు మ‌నం ఎలాంటి స‌మ‌స్య‌లు ఎదుర్కొంటున్నాము… వాటి నివార‌ణోపాయాలు ఒక‌సారి చూద్దాం.

మ‌నం మ‌న స‌మాజంలో ఈ విష‌యం ఎప్పుడూ వింటూనే ఉంటాం… అదేనండి దిష్టి త‌గ‌ల‌డం. ముఖ్యంగా ఈ దిష్టి పిల్ల‌ల‌కు తొంద‌ర‌గా త‌గులుతుంది. ఇలా జ‌రిగిప్పుడు ఏమి టెన్ష‌న్ ప‌డాల్సిన అవ‌స‌రం లేదు. ఆవుతోక‌ను మ‌నం 7 సార్లు త‌ల‌పై ఒంటిపై కొట్టుకుంటే స‌రిపోతుంది…అంతే దిష్టిపోతుంది.

గ్ర‌హ దోషాలు ఉన్న‌ట్ల‌యితే… కూడా మ‌నం ఆవుతో ప‌రిష్క‌రించుకోవ‌చ్చు. సాధార‌ణంగా జాతాకాల మీద న‌మ్మ‌కం ఉన్న వాళ్లు… జాత‌క చ‌క్ర‌లు వేయిస్తుంటారు. అలా చ‌క్రం ఉన్న వారికి సాధార‌ణంగా వారికి ఏ ద‌శ జ‌రుగుతుంది. గోచారంలో ఏ గ్ర‌హం ఎక్క‌డ ఉంది. గోచార దోషాలు ఏంటి ఆ విష‌యాలు తెలి‌సే ఉంటాయి.

అయితే ఎవ‌రికైతే జాత‌కంలో సూర్య గ్ర‌హం బాగోలేదు… వారు కేవ‌లం ఆదివారం రోజున రొట్టెల‌ను ఆవుకు పెడితే స‌రిపోతుంది….. అంతే ఈ చిన్న ఉపాయం ఆ గ్ర‌హ దోషాన్ని నివారిస్తుంది.

ఇక ఎవ‌రి విష‌యంలోనైనా… రాహు గ్ర‌హం బాగాలేని ప‌క్షంలో వాళ్లు ఆవు దగ్గ‌ర‌కు వెళ్లి దాని మెడను అంటే… గంగడోలు నిమరడం వలన మంచి జ‌రుగుతుంది. అదే విధంగా గోమూత్రం రెండు చుక్క‌లు ప‌డుకునే బెడ్‌పై చ‌ల్లితే.. దుస్వ్నాలు కూడా రావు. చెడు స్వ‌ప్నాలు వ‌చ్చే వారు ఇలా రెండు రోజులు చేస్తే చాలు మంచి ఫలితం క‌న‌ప‌డుతుంది.

మ‌నం త‌ర‌చూ వినే విష‌యం కాల‌సర్ప దోషం. మామూలుగా జాత‌క చ‌క్రంలో గ్ర‌హాలన్నీ రాహు.. కేతువు ల మ‌ధ్య‌లో ఉన్న‌ట్టైతే.. దాన్ని కాల సర్ప దోషంగా చెబుతుంటారు… జ్యోతిష్య పండితులు.
ఇలాంటి వారు చేయాల్సిందేమిటంటే… ఆవు కాలికింద దూళిని తిల‌కంగా పెట్టుకోవాలి… లేదా త‌మ ద‌గ్గ‌ర భ‌ద్ర‌ప‌ర్చుకోవాలి…వీలైతే ప‌ర్సులో పెట్టుకోవాలి. ఇలా చేస్తే చాలు కాల‌స‌ర్ప దోషం పోతుంది.

ఇక చంద్ర దోషం ఉన్న వాళ్లు అవుకు నీళ్లు తాగిస్తే స‌రిపోతుంది. ద‌గ్గ‌ర‌లో ఎక్క‌డ అవులు క‌నిపించినా… వాటికి నీటిని తాగిస్తే… చంద్ర గ్ర‌హం దోషంపోతుంది. ముఖ్యంగా ఎండాకాలంలో స‌మ‌యంలో ఆవులు ఎక్క‌డ క‌నిపించినా వాటికి నీళ్లుప‌ట్ట‌డం అల‌వాటు చేసుకోండి.

కొంత మందిని మ‌నం చూస్తూ ఉంటాం. వారు మాట్లాడితే ఎవ‌రికీ న‌చ్చ‌దు. వారిలో ఆత్మ‌స్థైర్యం కూడా త‌గినంతగా ఉండ‌దు. బుధ గ్ర‌హ దోషం ఉన్న వారికి ఇలా జ‌రుగుతుంటుంది. వాళ్లు ఆవుల‌కు ప‌చ్చ‌ని గ‌డ్డిని తినిపిస్తే మంచి ఫ‌లితాలు వ‌స్తుంటాయి. ముఖ్యంగా బుధ‌వారం రోజు ఇలా చేస్తే… బుధ గ్ర‌హం మంచి ఫ‌లితాలు ఇస్తుంది. అప్ప‌టి నుంచి వారి మాట‌కు విలువ కూడా పెరుగుతుంది.

ఎవ‌రికైతే త‌ర‌చూ కోపం వ‌స్తుంటుందో… కుజ గ్ర‌హం బాలేద‌ని వారు భావించ‌వ‌చ్చు. ఇలాంటి స‌మ‌స్య‌లు ఉన్నా… కుజ గ్ర‌హం దోషాలు ఉన్నా… ఆవుకు గోధుమలు తినిపిస్తే… సరిపోతుంది. అయితే ఇలా మంగ‌ళ‌వారం చేస్తే చాలా మంచిది.

ఇక ఎవ‌రికైతే శుక్ర గ్ర‌హం అనుకూలంగా లేదో వారు ప్ర‌తి శుక్ర‌వారం బియ్యంతో చేసిన పాయ‌సాన్ని ఆవుకు తినిపిస్తే…. స‌మ‌స్య‌లు ప‌రిష్కారం అవుతాయి.

ఇక మ‌నం ఎక్కువగా జ్యోతిష శాస్త్రంలో వినే అంశం శ‌ని గ్ర‌హం గురించి. శ‌ని ప్ర‌భావంతో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామ‌ని చెప్పేవాళ్ల‌ను మ‌నం చేసూ ఉంటాం. ఇలా ఇబ్బందులు ప‌డుతున్న‌వారు బ్రెడ్ లేదా రొట్టెలు తీసుకొని వాటికి నువ్వుల నూనె రాసి ఆవుకు పెట్టాలి. శ‌ని బాధ‌లు తొల‌గిపోతాయి. ఇలా శ‌నివారం చేస్తే.. మంచి ఫ‌లితాలు ఉంటాయ‌ని మ‌ర్చిపోకండి.

ఇంకా ఆవుకు పాల‌కూర తినిపిస్తే… బుధ గ్ర‌హం… శ‌ని గ్ర‌హం స‌మ‌స్య‌లు ఉన్న వారి స‌మ‌స్య‌లు తొల‌గిపోతాయి.

అదే విధంగా కేతు గ్ర‌హం వ‌ల్ల స‌మ‌స్య‌లు తొల‌గిపోవాలంటే… ఆవుకు నువ్వులు తినిపించాలి. వీలైతే…గోధుమ‌పిండిలో నువ్వులు క‌లిపి ఆవుకు పెట్ట‌వ‌చ్చు. ఇలా చేస్తే… కేతు గ్ర‌హం మంచి ఫ‌లితాలు ఇస్తుంది. శున‌కానికి కూడా సేవ‌లు చేయ‌వ‌చ్చు. కేతువుతో స‌మ‌స్య‌లు ఉన్న వారు శున‌కాన్ని కొట్ట‌వ‌ద్దు. అదే విధంగా ఆవును అస‌లు కొట్ట‌వ‌ద్దు. అలా చేస్తే అనేక ఇబ్బందులు ఎదుర్కొంటారు.

ఇక గోమూత్రాన్ని సేవిస్తే… రాహు గ్ర‌హం స‌మ‌స్య‌లు తొల‌గిపోతాయి. గోమూత్రం చుక్క‌లు బెడ్‌పై చ‌ల్లితే… ఏలాంటి పీడ క‌ల‌లు రావు. అదే విధంగా స్నానం చేసే నీళ్లో రెండు మూత‌ల గోమూత్రం క‌లిపి చేస్తే.. రాహు గ్ర‌హం మంచి ఫ‌లితాలు ఇస్తుంది.

ఇక ముఖ్య‌మైన గ్ర‌హం గురు గ్ర‌హాన్ని శాంత‌ప‌ర్చ‌డానికి మంచి ఉపాయం ఉంది. గురువారం రోజు గోధుమ పిండిని ఆవుకు తినిపించాలి… ఇది మంచి ఫ‌లితాల‌ను ఇస్తుంది.

మ‌నం సాధార‌ణంగా ఇంటి నుంచి ముఖ్య‌మైన ప‌నుల‌పై బ‌య‌ట‌కు వెళ్లే‌ప్పుడు త‌ల్లిదండ్రుల పాదాలు న‌మ‌స్క‌రించి వెళ్ల‌డం సాధార‌ణం. ఇలా చేసి వెళుతూ.. వెళుతూ… దారిలో ఆవు పాదాల‌ను కూడా తాగి వెళితే మ‌నం అనుకున్న ప‌నులు చ‌క‌చ‌కా జ‌రిగిపోతాయి. మ‌రొక ముఖ్య విష‌యం మ‌నం ఇలా వెళుతున్న‌ప్పుడు ఆవు అరుపులు విన‌ప‌డ‌డం ఎంతో శుభ‌ప‌రిణామం.

జ్యోతిష్యుల‌ను క‌లిసి ఎక్కువ డబ్బులు ఖ‌ర్చు చేయ‌డం క‌న్నా… ఇలా ఆవుకు సేవలు చేస్తే…. గ్ర‌హ దోషాలు తొల‌గిపోతాయి. ఆవు సేవ చేయండి… వాటిని సేవించి గ్ర‌హ స‌మ‌స్య‌లు తొల‌గించుకోండి..

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here