దేశవ్యాప్తంగా ఇప్పటిదాకా 8 కోట్ల టీకా డోసుల పంపిణీ

0
257
Spread the love

దేశవ్యాప్తంగా ఇప్పటిదాకా 8 కోట్ల టీకా డోసుల పంపిణీ

8 రాష్ట్రాలలో కొనసాగుతున్న కొత్త కేసుల పెరుగుదల

15 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో జాతీయ సగటు కంటే తక్కువ కోవిడ్ పరీక్షలు

కోవిడ్ మీద జరుపుతున్న పోరులో భారత్ మరో కీలకమైన మైలురాయిని చేరుకుంది. దేశవ్యాప్తంగా ఇచ్చిన టీకా డోసుల సంఖ్య 7.9 కోట్లు దాటింది.  మొత్తం 12,31,148 శిబిరాలద్వారా 7,91,05,163 టీకా డోసులిచ్చినట్టు ఈ ఉదయం 7 గంటలవరకు అందిన సమాచారం వెల్లడించింది.  ఇందులో 90,09,353 డోసులు ఆరోగ్య సిబ్బంది కిచ్చిన మొదటి డోసులు కాగా  53,43,493 రెండో డోసులు. అదే విధంగా 97,37,850 డోసులు కోవిడ్ యోధులకిచ్చిన మొదటి డోసులు కాగా 41,33,961 రెండో డోసులు. 45 ఏళ్ళు పైబడ్డవారికిచ్చిన  మొదటి డోసులు  4,99,31,635 కాగా  9,48,871 డొసులు వారికిచ్చిన రెండో డోసులు.

ఆరోగ్య సిబ్బంది కోవిడ్ యోధులు 45 ఏళ్ళు పైబడ్డవారు

మొత్తం

1వ డోస్ 2వ డోస్ 1వ డోస్ 2వ డోస్ 1వ డోస్ 2వ డోస్
90,09,353 53,43,493 97,37,850 41,33,961 4,99,31,635 9,48,871 7,91,05,163

టీకాల కార్యక్రమం మొదలైన 79వ రోజైన ఏప్రిల్ 4న  మొత్తం  16,38,464  టీకా డోసులు ఇవ్వగా అందులో  15,40,676 మంది లబ్ధిదారులకు  21,508 శిబిరాలలో మొదటి డోస్ ఇవ్వగా 97,788 మందికి రెండో డోస్ ఇచ్చారు.

తేదీ: ఏప్రిల్ 4, 2021
ఆరోగ్య సిబ్బంది కోవిడ్ యోధులు 45 ఏళ్ళు పైబడ్డవారు మొత్తం
1వ డోస్ 2వ డోస్ 1వ డోస్ 2వ డోస్ 1వ డోస్ 2వ డోస్ 1వ డోస్ 2వ డోస్
1,470 9,461 2,665 16,547 15,36,541 71,780 15,40,676 97,788

ఇప్పటిదాకా ఇచ్చిన కోవిడ్ టీకాలలో దాదాపు  60% ఎనిమిది రాష్ట్రాలలోనే ఇచ్చి ఉండటం గమనార్హం.

భారత్ లో కొత్త కరోనా కేసులు పెరుగుతూ ఉన్నాయి. గత 24 గంటలలో లక్షకు పైగా (1,03,558) కేసులు నమోదయ్యాయి.

మహారాష్ట్ర, చత్తీస్ గఢ్, కర్నాటక, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, తమిళనాడు, మధ్యప్రదేశ్, పంజాబ్ సహా ఎనిమిది రాష్ట్రాలలో కోవిడ్ కేసుల పెరుగుదల కనబడుతోంది. కొత్త కేసులలో 81.90% వాటా ఈ ఎనిమిది రాష్ట్రాలదే.  మహారాష్ట్రలో అత్యధికంగా ఒక్క రోజులో 57,074 (55.11%) కేసులు రాగా చత్తీస్ గఢ్ లో 5,250 కర్నాటకలో 4,553 కొత్త కేసులు నమోదయ్యాయి.

 

రోజువారీ కొత్త కేసులు పన్నెండు రాష్ట్రాలలో పెరుగుదల బాటలో ఉండగా ఈ క్రింది చిత్రపటం ఆ సమాచారం చూపుతుంది.

భారతదేశంలో ప్రస్తుతం చికిత్సలో ఉన్న కోవిడ్ కేసుల సంఖ్య 7,41,830 కి చేరింది. ఇది ఇప్పటిదాకా నమోదైన పాజిటివ్ కేసులలో 5.89%. గత 24 గంటలలో నికరంగా పెరిగిన చికిత్సలో ఉన్న కేసుల భారం   50,233. ఈ సమాచారాన్ని దిగువ చిత్రపటం వివరిస్తుంది.

 

ఐదు రాష్ట్రాలు – మహారాష్ట్ర, కర్నాటక, చత్తీస్ గఢ్, కేరళ, పంజాబ్ లో చికిత్సలో ఉన్న కేసులు దేశవ్యాప్తంగా చికిత్సలో ఉన్నవారిలో 75.88% వాటా ఉండగా ఒక్క మహారాష్ట్రలోనే 58.23% మంది ఉన్నారు.

ప్రతి పది లక్షల జనాభాలో కోవిడ్ పరీక్షలు జాతీయ సగటు1,80,449 కాగా పదిహేను రాష్టాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో అంతకంటే తక్కువ కోవిడ్ పరీక్షలు జరిగాయి.

దేశవ్యాప్తంగా ఇప్పటివరకు కోవిడ్ బారినుంచి బైటపడి కోలుకున్నవారి సంఖ్య  1,16,82,136  కాగా కోలుకున్నవారి శాతం 92.8%.

గడిచిన 24 గంటలలో 52,847 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు..

గత 24 గంటలలో 478 మంది కోవిడ్ తో చనిపోయారు. వారిలో ఎనిమిది రాష్ట్రాల వారు 84.52%  కాగా మహారాష్ట్రలో అత్యధికంగా 222 మంది చనిపోగా పంజాబ్ లో 51 మరణాలు నమోదయ్యాయి.

గత 24 గంటలలో 12 రాష్టాలలో ఒక్క కోవిడ్ మరణం కూడా నమోదు కాలేదు. అవి: పుదుచ్చేరి, లద్దాఖ్, డామన్-డయ్యూ, దాద్రా-నాగర్ హవేలి, నాగాలాండ్, మేఘాలయ, మణిపూర్, త్రిపుర, సిక్కిం, లక్షదీవులు, మిజోరం, అండమాన్-నికోబార్ దీవులు, అరుణాచల్ ప్రదేశ్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here