పల్లె ప్రగతితో తెలంగాణా పల్లెల రూపురేఖలు మారుతున్నాయి

0
83
Spread the love

వరంగల్ జిల్లా పర్వతగిరి మండలకేంద్రంలో పల్లెప్రగతి కార్యక్రమంలో పాల్గొన్న పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, మాజీ డిప్యూటీ సీఎం, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి, ఎమ్మెల్యే అరూరి రమేష్ తదితరులు

పర్వతగిరిలో 10 కోట్లతో నిర్మించిన ప్రభుత్వ పాఠశాల భవనం, రైతు వేదిక, అంతర్గత సీసీ రోడ్లను ప్రారంభించిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి, ఎమ్మెల్యే అరూరి రమేష్, కలెక్టర్ గోపి

పర్వతగిరి గ్రామానికి చెందిన మహిళా సంఘాల సభ్యులకు 12 కోట్ల రుణాల చెక్కులను అందించిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి, ఎమ్మెల్యే అరూరి రమేష్

 

 

మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కామెంట్స్

పల్లె ప్రగతితో తెలంగాణా పల్లెల రూపురేఖలు మారుతున్నాయి.

70 ఏండ్ల లో జరగని అభివృద్ది..7 ఏండ్ల కేసీఆర్ పాలనతోనే సాధ్యమయ్యింది.

తెలంగాణ గ్రామాలకు జాతీయ అవార్డులు రావడమే ప్రభుత్వ పాలనకు నిదర్శనం.

మన ఊరు మన బడితో సర్కారు బడులను బలోపేతం చేస్తున్నాం.

రైతు బంధు, రైతు భీమా, కాళేశ్వరం ప్రాజెక్టు, 24 గంటల కరెంట్ తో వ్యవసాయం పండగలా మారింది.

మరికొద్దిరోజులోనే కొత్త పింఛన్లు మంజూరు చేస్తాం.

కడియం శ్రీహరి కామెంట్స్

తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలు బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో అమలవుతున్నాయా?

తెలంగాణ ప్రభుత్వ పాలనపై చౌకబారు విమర్శలు చేసే ప్రతిపక్ష పార్టీ నాయకులు ఆత్మవిమర్శ చేసుకోవాలి.

విద్య, వైద్య రంగాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుంది

ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలు, డ్వాక్రా మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here