మాకు స్వాతంత్య్రం రాలేదు

0
108
Spread the love
తెలంగాణ ఎస్సీ బేడబుడగ జంగాల హక్కుల దండు తరపున ఎస్సీ వర్గీకరణ కావాలని ఎస్సీ 57 కులాల తరఫున తూర్పాటి హనుమంతు డిమాండ్ చేశారు సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో గురువారం జరిగిన తెలంగాణ ఎస్సీ బేడ బుడగ జంగాల హక్కుల దండు విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ స్వాతంత్రం వచ్చి 70 దతాబ్దాలు గడిచినా మాకు స్వాతంత్ర్యం రాలేదని ఈనాడు కూడా మా కులాల అభివృద్ధి చెందకుండా చేస్తున్నారని విమర్శించారు. ఈ రాష్ట్రంలో 57 ఉప కులాలు మరియు మాదిగ కులాలలోకి కోరుతున్నారు. కొంతమంది మాల మేధావులు వర్గీకరణ కావాలని అని అయితేనే మా సోదరులు ఎస్సీ ఉప కులాల వారు బాగుపడాలని కోరుకుంటున్నారు. కొంతమంది స్వార్థపరులు వర్గీకరణ వద్దని పబ్బం గడుపుతున్నారు. బక్కచిక్కిన కులాలను మరొక బలమైన కులం అనగ దొక్కుతున్నారు. తెలంగాణ మాలమహానాడు రాష్ట్ర అధ్యక్షులు అద్దంకి దయాకర్ గారు కూడా వర్గీకరణ జరగాలని జరిగితేనే ఎస్ సిలో ఉన్న అన్ని కులాలకు న్యాయం జరుగుతుందని అన్నారు. కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి గారు ఎమ్మార్పీఎస్ సభలో ఎస్సీ వర్గీకరణకు మా పార్టీ మద్దతు ఇస్తుందని చెప్తే కొంతమంది మాలమహానాడు నాయకులు ఎస్సీ వర్గీకరణ వద్దని చెప్పడం సిగ్గుచేటని అన్నారు. వారిని ఉద్దేశించి 57 ఎస్సి ఉప కులాలు అన్యాయం చేయాలని అనుకుంటున్నారని తెలిపారు. వారి స్వార్థంలో బేడ బుడగ జంగాలతోపాటు ఉపకులాలకు అన్యాయం చేయాలని అనుకుంటున్నారని అన్నారు. కిషన్ రెడ్డి గారికి ఎస్సీ ఉపకులాల తరఫున మద్దతు పలుకుతున్నాం బీసీల వర్గీకరణ చేసినట్లుగా ఎస్సీలో కూడా వర్గీకరణ చేయాలని డిమాండ్ చేశారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జనాభా ప్రాతిపదికన పలాలు పంచాలని చెప్పారు. ఆయన చెప్పినట్లుగా పలాలు పంచాలని డిమాండ్ చేశారు. ఎమ్మార్పీఎస్ ఎస్సీ 59 కులాలు బాగుపడాలని వర్గీకరణ కోరితే ఎట్లా సాధ్యం అవుతుందో మాలమహానాడు నాయకులు ప్రజలకు తెలియజేయాలని తెలంగాణ ఎస్సి బేడ బుడగ జంగాల హక్కుల తరపున డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రచార కార్యదర్శి ఇప్ప సత్యనారాయణ, రాష్ట్ర ఉపాధ్యక్షులు దాశరథి, హనుమంతు, జనార్ధన్, సీతారాం తదితరులు పాల్గొన్నారు
D Balakrishna, chief Editor - TOOFAN Telugu News Daily. This News Paper and News website runs from Hyderabad, Telangana State India. Telugu breaking news and Current Affairs, Sports, Crimenews, Fashion, Life style, Cricket, Cinema, Tollywood News updates. Political News of India and Telugu States Telangana and Andhrapradesh.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here