సర్పంచుల సంఘం నేతలతో భేటీ అయిన మంత్రి ఎర్ర‌బెల్లి

0
71
Spread the love

సర్పంచుల సంఘం నేతలతో భేటీ అయిన మంత్రి ఎర్ర‌బెల్లి

రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలంగాణ సర్పంచుల సంఘం నేతలతో గురువారం హైదరాబాద్ లోని మంత్రుల నివాసంలో సమావేశం అయ్యారు. తెలంగాణ రాష్ట్ర సర్పంచుల సంక్షేమ సంఘం నేతలు సౌదని భూమన్న యాదవ్, సర్పంచుల సంఘం అధ్యక్షుడు గూడూరు లక్ష్మీనరసింహ రెడ్డి, ప్రథాన కార్యదర్శి పాలకొండ ప్రనీల్ చందర్ లు వివిధ అంశాల పై మంత్రితో చర్చించారు. పెండింగ్ లో ఉన్న అన్ని బిల్లులను వెంటనే చెల్లించాలని సర్పంచులు కోరగా, ఆ బిల్లులకు సంబంధించిన వివరాలను ఆధారాలతో సహా మంత్రి వారికి వివరించారు.

సర్పంచులతో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కామెంట్స్

జీ పీ లకు పెండింగ్ బకాయిలు నిల్!

అన్ని రకాల నిధులు దాదాపు క్లియర్!

ఇంకా జీ.పి. ల నిధులు బకాయిలు ఏమైనా మిగిలి ఉంటే వెంటనే క్లియర్ చేస్తాం

కేంద్రం నుంచి రావాల్సిన ఇ జి ఎస్ మెటీరియల్ కంపోనెంట్ బకాయిలు రూ. 1140 కోట్లు

రాష్ట్రం విడుదల చేసిన నిధులు రూ.166 కోట్లు

రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జీ పీ రోడ్లకు ట్రెజరీ ల ద్వారా రూ.760 కోట్ల విలువైన లక్షా 45 వేల చెక్కులను జీ పీ లకు అందచేసిన0

కేంద్రం విడుదల చేయాల్సిన నిధులు రాగానే సీసీ రోడ్ల బకాయిలు

పల్లె పల్లె లో…విజయవంతంగా పల్లె ప్రగతి

పల్లె ప్రగతిలో సర్పంచుల పాత్ర అమోఘం

సర్పంచులకు బీమా విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళతా0

పల్లె ప్రగతి తర్వాత సర్పంచుల విస్తృత స్థాయి సమావేశం

తనను కలిసిన సర్పంచుల సంక్షేమ సంఘం నేతలతో పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు

సంతృప్తి వ్యక్తం చేసిన సర్పంచుల సంఘం నేతలు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here