స‌రిహద్దుల్లో సిద్ధమవుతున్న చైనా ఫైటర్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ బేస్‌

0
153
Spread the love

స‌రిహద్దుల్లో సిద్ధమవుతున్న
చైనా ఫైటర్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ బేస్‌

గత కొంతకాలంగా సరిహద్దులో ప్రశాంతంగా ఉన్నప్పటికీ చైనాతో ముప్పు తప్పేట్లు కనిపించడం లేదు. ఈ శ్రేణిలో తూర్పు లడఖ్‌ ప్రాంతానికి దగ్గరగా ఉన్న జిన్జియాంగ్‌ ప్రావిన్స్‌లోని షేక్‌ నగరంలో యుద్ధ విమానాల కార్యకలాపాల కోసం చైనా ఒక వైమానిక స్థావరాన్ని అభివృద్ధి చేస్తున్నట్లుగా సమాచారం. ఇదే సమయంలో ఇండియా వైపున ఉన్న లైన్‌ ఆఫ్‌ యాక్చువల్‌ కంట్రోల్‌ (ఎల్‌ఏసీ) వెంట తమ యుద్ధ విమాన కార్యకలాపాల పరిమితులను తొలగించడానికి ప్రయత్నిస్తున్నట్లుగా తెలుస్తున్నది. కొత్తగా ఏర్పాటు చేస్తున్న ఫైటర్‌ జెట్‌ స్థావరం చాలా కాలంగా భారత సరిహద్దుల్లో ఫైటర్‌ జెట్లను నడుపుతున్న కష్గర్‌, హొగన్‌ ఎయిర్‌ బేస్‌ మధ్య ఉన్నదని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. పోరాట కార్యకలాపాల కోసం ఈ కొత్త స్థావరం ఈ ప్రాంతంలోని చైనా వైమానిక దళానికి దగ్గరగా అందుబాటులో ఉండనున్నది. షాచే నగరంలో ఇప్పటికే చైనా ఎయిర్‌బేస్‌ ఉన్నదని, ఫైటర్‌ జెట్లను నడపడానికి దీనిని అప్‌గ్రేడ్‌ చేస్తున్నామని చైనాకు చెందిన మిలటరీ అధికారులు చెప్తున్నారు. సమీప భవిష్యత్‌లో ఈ స్థావరం యుద్ధ విమానాల నిర్వహణకు సిద్ధంగా ఉంటుందని, ఈ పనులు వేగవంతం జరుగుతున్నాయని వర్గాలు తెలిపాయి. యుద్ధ విమానాల ఆపరేషన్‌ కోసం ఎల్‌ఏసీకి దగ్గరగా చైనాలో ఉన్న ఎయిర్‌ఫీల్డ్‌ల మధ్య దూరం 400 కిలోమీటర్లు. అయితే ఇది షాకేచే ఎయిర్‌ఫీల్డ్‌ ఆపరేషన్‌తో పూర్తికానున్నది. సరిహద్దులో చైనా అభివృద్ధి చేస్తున్న ఎయిర్‌బేస్‌ పనులను భారత ప్రభుత్వం నిశితంగా పరిశీలిస్తున్నది. బారాహోటిలోని ఉత్తరాఖండ్‌ సరిహద్దు సమీపంలో చైనా వైమానిక క్షేత్రంపై కూడా భారతీయ సంస్థలు నిఘా పెడుతున్నాయి. ఇక్కడ చైనా పెద్ద సంఖ్యలో మానవరహిత వైమానిక వాహనాలను తీసుకువచ్చింది. అవి ఆ ప్రాంతంపై నిరంతరం ఎగురుతున్నాయి. ఇటీవల, చైనా వైమానిక దళం భారత భూభాగాల సమీపంలో విన్యాసాలను నిర్వహించింది. ఈ విన్యాసాలు ముఖ్యంగా హొగన్‌, కష్గర్‌, గార్‌ గున్సా వైమానిక క్షేత్రాల నుంచి జరిగినట్లుగా తెలుస్తున్నది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here