హోమ్‌లోన్‌పై వ‌డ్డీ రేటు పెంచిన ఎస్‌బీఐ

0
135
Spread the love

హోమ్‌లోన్‌పై వ‌డ్డీ రేటు పెంచిన ఎస్‌బీఐ

న్యూఢిల్లీ ఏప్రిల్ 5 (ఎక్స్ ప్రెస్ న్యూస్ );: దేశంలోని అతిపెద్ద బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) హోమ్‌లోన్ల‌పై వ‌డ్డీరేటును పెంచింది. మార్చి 31 వ‌ర‌కూ అతి త‌క్కువ వ‌డ్డీ రేటు (6.7 శాతం)కు హోమ్‌లోన్ అందించిన ఎస్‌బీఐ.. ఆ గ‌డువు ముగియ‌డంతో వ‌డ్డీరేటును 6.95 శాతానికి పెంచింది. ఈ కొత్త వ‌డ్డీరేట్లు ఏప్రిల్ 1 నుంచే అమల్లోకి వ‌చ్చిన‌ట్లు ఆ బ్యాంకు త‌న వెబ్‌సైట్‌లో వెల్ల‌డించింది. ఇంత వ‌ర‌కూ ఎస్‌బీఐను చూసి వ‌డ్డీ రేట్లు త‌గ్గించిన ఇత‌ర బ్యాంకులు కూడా ఇప్పుడు పెంచే అవ‌కాశాలు ఉన్నాయి.వ‌డ్డీ రేటు పెంచ‌డ‌మే కాదు.. ఇక నుంచీ అన్ని హోమ్‌లోన్ల‌పై ప్రాసెసింగ్ ఫీజు కూడా వ‌సూలు చేయ‌నున్న‌ట్లు బ్యాంకు స్ప‌ష్టం చేసింది. బ్యాంకు ప్రాసెసింగ్ ఫీజు రూపంలో 0.4 శాతం ప్ల‌స్ జీఎస్టీ వ‌సూలు చేస్తుంది. ఇది సాధార‌ణంగా కనిష్ఠంగా రూ.10 వేలు, గ‌రిష్ఠంగా రూ.30 ప్ల‌స్ జీఎస్టీ ఉంటుంది. ప‌రిమిత స‌మ‌యానికి గ‌త నెల‌లో ఎస్‌బీఐ హోమ్‌లోన్ల‌పై వ‌డ్డీ రేటును త‌గ్గించ‌డంతోపాటు ప్రాసెసింగ్ ఫీజును ఎత్తేసిన విష‌యం తెలిసిందే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here