2021 మే నెల లో జరగబోయే ఎన్నికలు మమతా బెనర్జీ కి చరమ గీతం పాడతాయా ? దీదీ పని ఫినిష్ ? Mamata Benarjee’s future in 2021 Elections?

0
259
Spread the love

2021 మే నెల లో జరగబోయే ఎన్నికలు మమతా బెనర్జీ కి చరమ గీతం పాడతాయా ? దీదీ పని ఫినిష్ ?
2021 మే నెల వెస్ట్ బెంగాల్ అసెంబ్లీ కాలం ముగిసిపోతుంది అయితే కేంద్ర ఎన్నికల సంఘం బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల కోసం కసరత్తు ప్రారంభించింది అప్పుడే. అయితే అసలు బెంగాల్ లో ఏం జరుగుతున్నది ?

ఏం జరగబోతున్నది ? సోషల్ మీడియాలో కానీ అటు జాతీయ మీడియాలో కానీ కొన్ని విచిత్రమయిన,భిన్నమయిన విశ్లేషణలు,ఊహాగానాలు వెలువడుతున్నాయి కానీ వేటికీ కూడా నిరూపించతగ్గ ఆధారాలు లేవు.

సోషల్ మీడియా లో వెల్లువెత్తుతున్న ప్రచారం ప్రకారం అయితే బిజేపి క్లీన్ స్వీప్ చేస్తుంది అదే జాతీయ మీడియాలో అయితే పూర్తి భిన్నంగా అభిప్రాయాలు అంటే మమత మళ్ళీ గెలుస్తుందనే ప్రచారం కొనసాగుతున్నది ఆఫ్కోర్స్ ల్యుటెన్ మీడియా ఎటూ యాంటీ బిజేపి కాబట్టి అలానే వ్రాస్తాయి లేదా చూపిస్తాయి కానీ అవి కూడా చాలావరకు అసంబద్ధంగానే ఉంటున్నాయి, అలా అని సోషల్ మీడియాలో వెల్లువెత్తుతున్నట్లు బిజేపి గెలిచే అవకాశాలు స్వల్పంగానే ఉండబోతున్నది.

అయితే ఇంకా నాలుగు నెలల సమయం ఉంది కాబట్టి ఆ లోపు ఏమైనా జరగచ్చు. ఇప్పటి వరకు లభిస్తున్న సమాచారం ప్రకారం అయితే బిజేపి కి అనుకూలంగానే ఉంది. ఒక సారి అవేంటో చూద్దాం.

2011 లో అప్పటి కమ్మీ ప్రభుత్వాన్ని కూలదోసి తృణమూల్ కాంగ్రెస్ మమతా నేతృత్వంలో అధికారం చేజిక్కించుకోవడం అనేది ఒక చారిత్రిక సంఘటనగానే చెప్పుకోవాలి. వరసగా 7 సార్లు ఎన్నికల్లో గెలిచి సుదీర్ఘ కాలం బెంగాల్ ని పాలించిన కమ్మీల ని గద్దె దించడం సామాన్య విషయం ఏమీ కాదు ఆ మాటకొస్తే కమ్మీల కి ముందు కాంగ్రెస్ పాలించింది బెంగాల్ ని కానీ తిరిగి అధికారం కైవసం చేసుకోవడంలో వెనకపడిపోయింది కాంగ్రెస్.

TMC గెలవడానికి ప్రధాన కారణం కమ్మీ ల పాలనతో విసుగెత్తిన బెంగాల్ ప్రజలకి మమత రూపంలో ప్రత్యామ్నాయం కనపడ్డది 2011 లో. 2011 లో తాను గద్దెనెక్కిన తరువాత వరసపెట్టి కమ్యూనిస్ట్ నాయకులని,కార్యకర్తలని చంపించింది మమత. చాలావరకు కమ్యూనిస్ట్ కార్యకర్తలు తృణమూల్ కాంగ్రెస్ లో చెరిపోయారు ఎదురు తిరిగినవాళ్ళు హత్య చేయబడ్డారు. గత 9 ఏళ్లలో మమత చేసినపని కమ్యూనిస్టులు అనే వాళ్ళు లేకుండా చేసింది. దాంతో బెంగాల్ లో అధికార పక్షం కాకుండా ఇంకెవరూ లేని శూన్యం ఏర్పడ్డది ఇదే బిజేపి కి కలిసివచ్చింది.

ఎలాగయితే తెలంగాణ లో ప్రతి పక్షం లేకుండా పోయినప్పుడు ఆ శూన్యాన్ని బిజేపి భర్తీ చేస్తూ వస్తున్నది. అయితే బెంగాల్ లో మాత్రం విపరీతమయిన మైనార్టీల బుజ్జగింపులు అనేది అక్కడి ప్రజల్లో వ్యతిరేకత ని పుట్టించింది.

రెండు పాయింట్లలో క్లుప్తంగా…

1. బంగ్లాదేశ్ విభజనకి ముందు అల్లర్లు బంగ్లాదేశ్ ఏర్పడిన తరువాత జరిగిన అల్లర్లు అక్కడి హిందువులలో భయాందోళనలకి కారణం కావడం చేత చాలా వరకు సరిహద్దులు దాటి బెంగాల్ లోకి వచ్చేశారు కాందిశీకులుగా.

అలా వచ్చిన వారికి అప్పటి కమ్యూనిస్ట్ ప్రభుత్వం వాళ్ళకి రేషన్ కార్డులు,ఇళ్ల పట్టాలు ఇచ్చి వాళ్ళని తమ వోట్ బాంక్ గా మలచుకొని 7 సార్లు ఎన్నికల్లో గెలిచి అధికారం చెలాయించింది.

2. మమత కూడా సేమ్ ఫార్ములాని ఫాలో అయ్యింది కాకపోతే 2011 నుండి బంగ్లాదేశ్ నుండి ముస్లిమ్స్ ని బెంగాల్ లోకి ఆహ్వానించి వాళ్ళని తమ వోట్ బాంక్ గా వాడుకున్నది గత రెండు సార్లు ఎన్నికల సందర్భంగా. ఇదే అక్కడి ప్రజల్లో వ్యతిరేకతకి కారణం అయ్యింది ఇప్పుడు. తృణమూల్ కాంగ్రెస్ లోని నాయకులలో కూడా ఈ విధానం నచ్చటలేదు ఎందుకంటే ప్రజల్లో ఉన్న ఆగ్రహం వాళ్ళకి తెలుస్తూనే ఉన్నది కానీ మామతకి వ్యతిరేకంగా మాట్లాడలేరు. సరిగ్గ తృణమూల్ ఎంఎల్ఏ ల అసంతృప్తిని తనకి అనుకూలంగా మాలచుకున్నది బిజేపి. వరసగా రాజీనామాలు మమతకి నిద్ర పోనివ్వటలేదు అలా అని ఇప్పటికిప్పుడు అందరూ బయటపడట్లేదు కానీ ఒక సారి ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన తరువాత తృణమూల్ ఖాళీ అయిపోతుంది అన్నది పాక్షికంగా నిజం.

సువెందు అధికారి-తృణమూల్ మాజీ మంత్రి , మమత గుట్టు బాగా తెలిసినవాడు. తృణమూల్ పార్టీ ఆవిర్భావం నుండి మమత కి కుడి భుజంగా వ్యవహరించాడు అసలు మమత తన రాజకీయ వ్యూహాలని సువెందు అధికారి ద్వారానే అమలు చేసింది అలాంటి సువెందు అధికారి రాజీనామ చేసి మరీ బిజేపి లో చెరిపోయాడు అంటే మమత అంటే పార్టీలోని ముఖ్యుల దగ్గర నుండి మమత ఫోటో తో గెలిచిన వారంతా ఇప్పుడు పార్టీ నుండి బయటకి రావాలనే ఆలోచనలో ఉన్నారు. ఇదంతా ఎందుకంటే తమ నియోజకవర్గాలలో తమ పార్టీ పట్ల పెల్లుబుకుతున్న వ్యతిరేకతని గుర్తించారు బాగానే. తృణమూల్ మునిగిపోయే నావ లాగానే భావిస్తున్నారు ప్రస్తుత ఎంఎల్ఏ లు , పార్లమెంట్ సభ్యులు కూడా. గత కమ్యూనిస్ట్ ప్రభుత్వం ఏదయితే చేసి ప్రజల ఛీ కొట్టించుకుందో అదే పని మమతా చేస్తుండడమే. రాజీనామాలు చేసి బిజేపి లోకి చేరిన ఎంఎల్ఏ ల లిస్ట్ ఒకసారి చూడండి.
Sunil Mandal, MP from Burdwan purba, TMC
● Suvendu Adhikari, MLA from Tamluk and former minister, TMC
● Banasri Maity, MLA from Kanthi uttar, TMC
● Biswajeet kundu, MLA from Kalna, TMC
● Saikat Panja, MLA from East Bardhaman, TMC
● Dipali Biswas, MLA from Ghazole, GMC
● Shilbhadra datta, MLA from Barrackpore, TMC
● Shukra Munda, MLA from Nagrakata, TMC
● Ashok Dinda, MLA from Tamluk, CPI
● Tapashi Mandal, MLA from Haldia, CPIM
● Sandeep Mukharjee, MLA from Purulia, Congress
● Former MP Dasharath Tirkey, GMC
● Ex minister Shyamapada Mukherjee, TMC
● Former MLA Satyen Roy, GMC . వీళ్ళు జస్ట్ లాంఛనం మాత్రమే ! ఎన్నికల షెడ్యూల్ వెలువడగానే రాజీనామాల పర్వం మొదలయి శిఖరాగ్రానికి చేరుకుంటుంది. మోటూ భాయ్ చాలా నిశ్శబ్దంగా పని చేసుకుపోతున్నాడు షరా మామూలుగానే ! బెంగాల్ లో హింస జరుగుతున్నా , బిజేపి నాయకులని,కార్యకర్తలని మమత చంపుతున్నా మోటూ భాయ్ ఏమీ చేయట్లేదు అంటూ నిష్టూరాలు పలికిన బిజేపి అభిమానులకి ఇప్పటికయినా అర్ధమవుతుంది అని ఆశిస్తూ ! శుభం భూయాత్ !
జైహింద్ !

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here