ద‌ర్శ‌న‌మ్ ఆధ్వ‌ర్యంలో 16న లలిత్ ఆదిత్య సంస్కృతాంధ్ర ద్విగుణిత అష్టావధానం

0
434
Spread the love

ద‌ర్శ‌న‌మ్ ఆధ్వ‌ర్యంలో 16న లలిత్ ఆదిత్య సంస్కృతాంధ్ర ద్విగుణిత అష్టావధానం

అమెరికాలో పుట్టిపెరిగిన మాతృభాష, దేవభాష మీద మమకారంతో చిన్నతనంలోనే కఠోర దీక్షతో సంస్కృతాంధ్ర పండితునిగా ఎదిగి అష్టావధానిగా ప్రఖ్యాతి గడించిన సరస్వతీ పుత్రుడు 18 ఏళ్ల గన్నవరం లలిత్ ఆదిత్య. కొద్ది రోజుల పర్యటన కోసం హైదరాబాద్ విచ్చేశారు . అమెరికాలో ఏరో స్పేస్ ఇంజనీరింగ్ మొదటిసంవత్సరం చదువుతున్న ఈ బాలుడు కొన్నేళ్లుగా అమెరికాలో సంస్కృతాంధ్ర అష్టావధానాలు అద్భుతంగా చేస్తున్నారు. దర్శనమ్ ఆధ్యాత్మిక వార్తా మాసపత్రిక ఆధ్వర్యంలో ఈనెల 16-01-2019,బుధవారం సాయంత్రం 5. గంటలకు ఉత్తరాయణ పుణ్యకాలం సంక్రాంతి కనుమ పర్వదినాన రవీంద్రభారతిలో అమెరికా తెలుగు తేజం 18 ఏళ్ల లలిత్ ఆదిత్య సంస్కృతాంధ్ర ద్విగుణిత అష్టావధానం నిర్వహిస్తున్నాము. సంస్కృతాంద్రం లో తొలిసారిగా నిర్వహిస్తున్న ఈ అద్భుత సాహితీ ప్రక్రియ బూడుగంటల పాటు భాషా,సాహితీ ప్రియులను అలరించనుంది . ఈ కార్యక్రమంలో తెలుగు ప్రాశ్నికులు (పృచ్ఛకులు)గా 8 మంది, సంస్కృత ప్రచ్ఛకులుగా 8 మంది మొత్తం 16 మంది ఉద్దండులయిన సంస్కృతాంధ్ర పండితులు పాల్గొంటున్నారు. పృచ్ఛకుల్లో ఐదుగురు అష్టావధానులు ఉండటం విశేషం. ఈ ద్విగుణిత అష్టావధానం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు డా. కేవీ రమణాచారి, గౌరవ అతిథులుగా సాంస్కృతిక శాఖ సంచాలకులు శ్రీ మామిడి హరికృష్ణ , మహామహోపాధ్యాయ శ్రీ దోర్బల ప్రభాకర శర్మ, శతావధాని డా. జీఎం రామశర్మ ,విఖ్యాత అవధానులు డా. అయాచితం నటేశ్వర శర్మ, డా. పాలపర్తి శ్యామలానంద ప్రసాద్, సంస్కృతభారతి అధ్యక్షులు శ్రీ నరేంద్ర కాప్రె, అవధాన సమన్వయకర్తగా శ్రీ మరుమాముల దత్తాత్రేయ శర్మ పాల్గొంటున్నారు. ఏ అద్భుత సాహితీ మహోత్సవం “ద్విగుణిత ష్టావధానం” ఆస్వాదించటానికి సాహితీప్రియులందరూ అధికసంఖ్యలో పాల్గొనవలసిందిగా కోరుతున్నాము.ఈ ఉత్కృష్ట ద్విగుణిత అష్టావధాన కార్యక్రమానికి మీరు తగిన ప్రాచుర్యాన్ని కల్పించి తెలుగు , సంస్కృత భాషా సేవకు తోడ్పాడునందించాల్సిందిగా కోరుతున్నాను . భవదీయుడు
మరుమాముల వెంకటరమణ శర్మ, సంపాదకులు దర్శనమ్, 9441015469, 7013093123

అవధాని గన్నవరం లలిత్ ఆదిత్యగురించి..

అమెరికాలో నివాసముంటున్న చిరంజీవి గన్నవరం లలిత్ ఆదిత్య…. అతి పిన్న వయస్కుడైన18 వసంతాలు నిండిన సంస్కృతాంధ్రభాషలలో అవధాని . తండ్రి: గన్నవరం మారుతి శశిధర్.. తల్లి: గన్నవరం శైలజ…జన్మదినము: 23-09-,2000, విద్యార్థి – Aerospace Engineering 1st year ప్రవృత్తి: సంస్కృతాంధ్రసాహిత్యపఠనకవనములు, అవధానములు, సంగీతము, టెన్నీస్, బిరుదులు: అవధానయువకిశోరము, అవధానయువశిరోమణి, లలిత్ అవధాని గురువుగారు శ్రీ మల్లాప్రగడ శ్రీనివాస్ వారు (శృంగేరి పరంపర). వారు వీనికి వేదము, వేదాంతము, పూజావిధులు, ఇత్యాదులను నేర్పుతున్నారు, మహానుభావులు.వీని అవధానగురువులు శ్రీ ధూళిపాళ మహదేవమణి . అవధానమే కాక ఛందస్సు, సంస్కృతవ్యాకరణము కూడా నేర్పుతున్నారు.వీనికి సంస్కృతములో మొదటి గురువులు రాయప్రోలు కామేశ్వర శర్మ వారు. తెలుగు రచనలు:హనుమద్దోర్దండశతకము, శ్రీరామషోడశి, ఆవిర్భావము(నరసింహావిర్భావఘట్టము), పర్యావరణావనము, శార్దూలవిక్రీడితము, సంస్కృతరచనలు: నారసింహనమశ్శతం, శారదాపంచవింశికా, హనుమన్నవకం, నృసింహపాదాదికేసరాంతస్తోత్రము. ఈ లలిత్ అవధాని నివాసము అమెరికాలో (Austin, Texas)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here