ప్రత్యేకంగా పథ‌కాలు అమలు చేస్తున్నా….మానవ హక్కులన్నీ అనుభవిస్తున్న దాఖలాలు సున్నా

0
371
Spread the love

మహిళా హక్కులు అంటే మానవ హక్కులు అని బీజింగ్ లో హిల్లరీ క్లింటన్ తేల్చి చెప్పి 25 ఏళ్ళు అయింది. మహిళల కోసం చట్టాలు చేస్తున్నా, ప్రత్యేకంగా పధకాలు అమలు చేస్తున్నా వారు పూర్తిగా మానవ హక్కులన్నీ అనుభవిస్తున్న దాఖలాలు తెలంగాణ రాష్ట్రంలో కనబడట్లేదు.
ముఖ్యంగా సమానత్వం, స్వేఛ్చ, జీవన ప్రమాణాలు, భద్రత అనే నాలుగు మానవ హక్కుల ద్రుష్టికోణంలో మనం రాష్ట్రలోని మహిళల పరిస్థితిని ఈ విధంగా గమనించవచ్చు. తెలంగాణ రాష్ట్రం లింగ సమానత్వంలో దేశంలో అన్ని రాష్ట్రాలకంటే అట్టడుగున ఉంది అని నీతి ఆయోగ్ వారి SDG సూచి చెప్పింది. గమనించాల్సిన విషయం ఎమిటంటే మనలాగే కొత్తగా ఏర్పాటైన చత్తీస్గర్హ్, ఝార్ఖండ్, ఉత్తరాఖండ్ కంటే మనం దిగువన ఉండటం మరియూ దేశంలో మహిళల మీద అత్యధికంగా దాడులు జరిగే ఉత్తర్ ప్రదేశ్(NCRB’19) కన్నా దిగువన వుండటం అత్యంత బాధాకరం.
లింగ సమానత్వాన్ని వివిధ సూచీలుగా విడదీసి గమనిస్తే లోటు ఎక్కడుందో తేటతెల్లం అవుతుంది. ప్రప్రధమంగా మహిళల మీద జరిగే నేరాల పరంగా చూస్తే దేశంలో రెండవ స్థానంలో వున్నామని నీతి ఆయోగ్ అధ్యయనం మరియూ NCRB చెప్తున్నాయి. ఆ నేరాలు ఆడపిల్లల మీద కూడా దేశంలోని సగటు రేటు కంటే ఎక్కువ జరగటం బాధాకరం. పిల్లల మీద జరిగే నేరాల్లో ఆడపిల్లల మీద జరిగే నిష్పత్తి 90.32%! దీనికి కారణం కుటుంబం నుండే సగం మొదలవుతోంది అనటానికి ఆధారం 15-49 సంవత్సరాల మధ్య ఉన్న వివాహిత మహిళల్లో 46% మంది భాగస్వామి నుండే హింస అనుభవించాల్సి రావటం. దక్షిణాది రాష్ట్రలు అన్నిటిలో మద్యం వినియోగం తెలంగాణాలో ఎక్కువ. WHO ప్రకారం మద్యపానం మహిళల మీద హింసకు ఒక ముఖ్య కారణం.  ఇటువంటి దారుణమైన లైంగిక మరియూ శారీరక హింసకు కారణాలు లేకపోలేదు. రాష్ట్రంలో మహిళల జీవన పరిణామాలు చుస్తే, విద్యలో NSO ప్రకారం దేశంలోని పెద్ద రాష్ట్రాలతో పోలిస్తే గ్రామీణ మహిళలకు అక్షరాస్యత అందించటంలో చివర నుండి రెండవ స్థానంలో ఉంది. మరియూ అక్షరాస్యత సాధనలో మగవారితో పోలిస్తే ఆడవారు 15% వెనుకబడి వున్నారు. ఆరోగ్యంలో NFHS ప్రకారం తెలంగాణ మహిళలు దేశంలో సగటు మహిళకంటే 3.7% ఎక్కువ రక్తహీనత కలిగి వున్నారు. మానసిక ఆరొగ్యంలోనూ మహిళలు పురుషులకంటే 2:1 నిష్పత్తిలో అనారోగ్యం పాలు అయ్యే అవకాశం ఎక్కువ.
నోబెల్ గ్రహీతలైన ఎస్తర్ డుఫ్లో, అభిజీత్ బెనర్జీ సంస్థ J-PAL అధ్యయనంలో తేల్చినట్లు ఆర్ధిక స్వాతంత్ర్యం, స్వీయ స్వావలంబన స్త్రీల “agency” ని పెంచుతాయి – అంటే కుటుంబం, సమాజం, ఉద్యోగం మొదలైన చోట్ల వారి గొంతును వినిపించి హక్కులను కాపాడుకోగలిగే శక్తి. ఆ అంచనాల్లో కూడా తెలంగాణ మహిళలు వెనుకబడి వుండటం బాధాకరం. గ్రామీణ మహిళలు ఎక్కువ శాతంలో పని చేస్తున్నా, పట్టణ మహిళలు అత్యధికంగా నిరుద్యోగులుగా ఉన్నారు. లేబర్ బ్యూరో నిర్వహించిన 4th annual unemployment సర్వే ప్రకారం ప్రతి 1000 మందిలో 292 మంది పట్టణ మహిళలే ఉద్యోగస్తులై ఉండటం గమనించదగ్గ విషయం. ఇంతకంటే దారుణం వేతన

నిష్పత్తి. మగవారు 100 రూపాయలు సంపాదిస్తే మహిళలు 59 రూపాయలే సంపాదిస్తున్నారు. ఇంకా భూమి యాజమాన్యంలోనూ మహిళా పట్టాదారుల శాతం తక్కువే. చట్టసభల లోనూ 5% మహిళలే వుండటం రాష్ట్రంలో మహిళా సమస్యలు ఎంత వరకూ వినిపిస్తునాయి అనటానికి చిహ్నం.
ఈ విధంగా స్వేఛ్చను ఆస్వాదించటంలోనూ, భద్రతా విషయంలోనూ, జీవన ప్రమాణాల్లోనూ తెలంగాణలోని మహిళలు వెనుకబడి ఉండటం బాధాకరం. రెండేళ్ళుగా తెలంగాణ మహిళా కమిషన్ నియమించకపోవటం, మహిళా పాలసీ లేకపోవటం కూడా ప్రత్యేకంగా గమనించదగ్గ విషయాలు.
రాష్ట్రం మొదటగా మహిళా కమిషన్ ను నియమించాలి. 2018 లో మొదలుపెడతామన్న Gender Budget ను మొదలు పెట్టాలి. కళ్యాణ లక్ష్మి వంటి పధకాల యొక్క దుష్పలితాలు బేరీజు వేసి పునరాలోచన చేయాలి. మహిళల భద్రత నుండి మహిళా సాధికారత వైపుకు అడుగులు వేయాలి.

లక్ష్మీ స్వాతి ,
సివిల్ సర్వీసెస్ పరీక్షా విద్యార్ధులకు అధ్యాపకురాలు
ఆమె నేస్తం ఫౌండర్

ధరణి ఇలా పని చేస్తుంది … సులభంగా స్లాట్‌ బుకింగ్‌..

D Balakrishna, chief Editor - TOOFAN Telugu News Daily. This News Paper and News website runs from Hyderabad, Telangana State India. Telugu breaking news and Current Affairs, Sports, Crimenews, Fashion, Life style, Cricket, Cinema, Tollywood News updates. Political News of India and Telugu States Telangana and Andhrapradesh.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here