మరోసారి ముక్క‌లైన అమీర్ ఖాన్ దాంపత్యం.. రెండో భార్యతో విడాకులు

0
165
Spread the love

మరోసారి ముక్క‌లైన అమీర్ ఖాన్ దాంపత్యం.. రెండో భార్యతో విడాకులు

ముంబై జూలై 3 (ఎక్స్ ప్రెస్ న్యూస్ );: బాలీవుడ్ మిస్టర్ ఫర్‌ఫెక్ట్‌గా పేరుగాంచిన‌ అమీర్ ఖాన్ దాంపత్య జీవితం మరోసారి ముక్క‌లైంది. తన రెండో భార్య కిరణ్‌రావుతో కూడా ఆయ‌న విడిపోయారు. ఈ మేర‌కు తాము విడాకులు తీసుకున్నామంటూ అమీర్‌ఖాన్‌, కిరణ్‌రావు సంయుక్తంగా ఒక అధికారిక ప్ర‌క‌ట‌న చేశారు. ఆ ప్ర‌క‌ట‌న‌తో వారి 15 ఏండ్ల‌ వైవాహిక జీవితానికి తెరపడిన‌ట్ల‌య్యింది. అమీర్‌ఖాన్ ప‌దిహేనేండ్ల క్రిత‌మే మొద‌టి భార్య‌తో విడిపోయి కిర‌ణ్‌రావు రెండో వివాహం చేసుకున్నారు.తాజాగా ఇవాళ అమీర్ ఖాన్, కిరణ్ రావు సంయుక్తంగా ఒక‌ ప్రకటనను విడుదల చేస్తూ.. మా 15 సంవత్సరాల వైవాహిక జీవితంలో జీవితానికి సరిపడే అద్భుతమైన అనుభవాలను, సంతోషాల‌ను, ఆనందాల‌ను పంచుకున్నాం. మా బంధం నమ్మకం, గౌరవం, ప్రేమ అనే పునాదుల మీద నిల‌బడింది. అయితే ఇప్పుడు మేం మా జీవితాల్లో కొత్త అధ్యాయాల‌ను ప్రారంభించ‌బోతున్నాం. మేమిద్దరం ఎక్కువ కాలం భార్య, భర్తలుగా ఉండలేదు. మా బిడ్డకు తల్లితండ్రులుగా ఉంటూనే వేర్వేరుగా జీవించాలని నిర్ణయం తీసుకున్నాంఅని పేర్కొన్నారు.కాగా, అమీర్‌ఖాన్ 1986లో రీణా ద‌త్తాను మొదటి వివాహం చేసుకున్నారు. వారికి కూతురు ఇరా ఖాన్‌, కుమారుడు జునైద్ ఖాన్ ఉన్నారు. 2002లో అమీర్‌ఖాన్‌, రీణా ద‌త్తాలు త‌మ వైవాహిక బంధానికి తెర‌దించారు. 2005లో కిర‌ణ్ రావును రెండో వివాహం చేసుకున్నారు. వారికి ఆజాద్ ఖాన్ అనే కుమారుడు ఉన్నారు. తాజాగా కిర‌ణ్‌రావుతో వైవాహిక బంధానికి కూడా అమీర్‌ఖాన్ తెర‌దించారు. అయితే భార్యాభ‌ర్త‌లుగా విడిపోయినా కుటుంబ‌స‌భ్య‌లుగా ఒక‌రికి ఒక‌రం క‌లిసే ఉంటామ‌ని ప్ర‌కటించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here