స్వాతంత్ర పోరాటయోధుల నాటి త్యాగమే నేటి స్వేచ్ఛా వాయువులు

0
47
Spread the love

స్వాతంత్ర పోరాటయోధుల నాటి త్యాగమే నేటి స్వేచ్ఛా వాయువులు

దేవరకొండ పురపాలక సంస్థ అధ్యక్షులు ఆల్లపల్లి నరసింహ

నాటి స్వతంత్ర పోరాటం సమరంలో ఎంతోమంది తమ ప్రాణాలను సైతం తృణప్రాయంగా భావించి త్యాగం చేయడం వలనే నేటి స్వేచ్ఛావాయువులు తీసుకుంటున్నామని, ప్రతి ఒక్క భారతీయుడు స్వాతంత్ర్య ఫలాలను అనుభవిస్తున్నారని దేవరకొండ పురపాలక సంస్థ అధ్యక్షులు ఆల్లపల్లి నరసింహ అన్నారు. దేశ స్వతంత్ర సంగ్రామం ప్రారంభమై 75 ఏళ్లు నిండిన సందర్భంగా చేపట్టిన ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగంగా కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖకు చెందిన ఫీల్డ్ ఔట్రీచ్ బ్యూరో జిల్లా యూనిట్ ఆధ్వర్యంలో అక్టోబర్ 1 నుంచి 3 వరకు ప్రముఖ తెలుగు స్వాతంత్ర్య సమరయోధుల, మహాత్మా గాంధీ జీవితం పై దేవరకొండ జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల ప్రాంగణంలో ఏర్పాటుచేసిన ఫోటో ఎగ్జిబిషన్ ను బుధవారం ఆయన ప్రారంభించారు. మహాత్మా గాంధీ చిత్ర పటానికి నివాళులు అర్పించి అనంతరం మాట్లాడుతూ అటు బ్రిటిష్ వారిని, ఇటు నిజాం పాలనను ఎదిరించి తెలుగు రాష్ట్రాల్లో ని ప్రజలు నాయకులు అవిశ్రాంత పోరు సల్పారు అని గుర్తు చేశారు. భారత దేశ వ్యాప్తంగా జరిగిన స్వాతంత్ర పోరాటంలో తెలుగు ప్రజలు కూడా భాగస్వాములై తన వంతు కర్తవ్యం నిర్వహించి స్వతంత్ర సాధనలో పాలుపంచుకోవడం మనందరికీ గర్వకారణం అని చెప్పారు. తదుపరి నిజాం ప్రభువు భారతదేశంలో విలీనం విలీనం చేయకుండా నిరారించినా పోరాడి భారతదేశంలో కలవడం జరిగింది అన్నారు. స్వాతంత్రం కోసం అసువులు బాసిన అమరుల అందర్ని ప్రతి భారతీయుడు తలుచుకోవడం, వారికి నివాళులర్పించడం మహా యోధులను గుర్తు తెచ్చుకోవడం కోసం ఇలాంటి ఎగ్జిబిషన్లు ఏర్పాటు చేయడం అవసరం అన్నారు. ఆనాటి త్యాగధనుల పోరాటాలను, త్యాగాలను స్మరించుకుంటూ వారి బాటలో నడవాలని పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ దేశభక్తితో తెలంగాణ కోసం అమరులైన వారందరినీ కూడా స్మరించుకోవడం తెలంగాణ బిడ్డగా గర్వపడాలి అన్నారు. దేశ దాస్య శృంఖలాలు చేదించిన విధంగానే తెలంగాణలో కూడా దశాబ్దాల పోరాటం నెరవేరి స్వేచ్ఛా స్వాతంత్ర్యాలను నేడు ప్రతి తెలంగాణ పౌరుడు అనుభవిస్తున్నారని పేర్కొన్నారు. జిల్లా క్షేత్ర ప్రచార అధికారి కోటేశ్వరరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఉపాధ్యక్షులు రహమత్ అలి, కమీషనర్ వెంకన్న, మండల విద్యాధకారి సంతు నాయక్, MKR ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సిపాల్, NCC కమాండెంట్, బాలుర, బాలికల ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. అనంతరం పురపాలక సంస్థ అధ్యక్షులు, అతిథులు ఫోటో ఎగ్జిబిషన్ ను తిలకించారు తొలిసారి హైదరాబాద్ సంస్థానంలో సంపూర్ణ స్వతంత్రం కోసం పోరాడిన సమరయోధుల వివరాలతో ఈ ఫోటో ఎగ్జిబిషన్ నిర్వహించడం పట్ల నిర్వాహకులను పలువురు అభినందిస్తూ హర్షం వ్యక్తం చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here