స‌న‌త్‌న‌గ‌ర్‌లో కూన త‌ర‌పున ప్ర‌చారం చేసిన సినీన‌టి న‌గ్మా

0
693
Spread the love

స‌న‌త్‌న‌గ‌ర్‌లో కూన త‌ర‌పున ప్ర‌చారం చేసిన సినీన‌టి న‌గ్మా

రౌడియిజం తో కక్ష పూరితంగా డబ్బులు పేట్టి తనను ఇరికించాలని తలసాని వర్గీయులు ప్రయత్నిస్తున్నరాని ఆరోపించారు సనత్ నగర్ ప్ర‌జా కూటమి టీడీపీ అభ్యర్ధి కూన వెంకటేష్. సనత్ నగర్ నియోజికవర్గం లోని బండి మెట్ లో కూన వెంకటేష్ గౌడ్ త‌న అల్లుడు సుధీర్ తో కలసి ఇంటి ఇంటి కి తిరుగుతు ప్రచారం చేశారు. ఇక్క‌డి బ‌స్తీల్లో గడప గడప తిరుగుతూ సైకిల్ గుర్తుకే ఓటు వేసి గెలిపించాలని విజ్ణాప్తి చేశారు. చంద్రబాబు రోడ్ షో కోసం వచ్చిన కార్యకర్తలను టార్గెట్ చేసి…రాత్రి సమయంలో మంత్రి త‌లసాని వ‌ర్గీయులు దాడికి పాల్పడ్డరాని..వారి వ‌ద్ద డబ్బులు లేకున్న వాటిని పెట్టి మ‌రీ ఇరికించాలని చుశారని కూన వెంకటేష్ దుయ్య‌బ‌ట్టారు. తలసాని వర్గీయుల చేస్తున్న జులంను ప్రజలు గమనిస్తున్నారని..తమ విలువైన ఓట్ ను సైలెంట్ గా వేసి నన్నే గెలిపిస్తారని వెంక‌టేష్ గౌడ్ ధీమ వ్య‌క్తం చేశారు. అయితే ఈ రోజు కూన వెంకటేష్ ను గెలిపించాలని కోరుతూ ఆయ‌న‌కు మ‌ద్ద‌తుగా రోడ్ షో నిర్వహించారు సినినటి నగ్మా. అభ్యర్ధితో కలసి బండిమెట్, బాటా చౌరస్తా, సోల పూర్ చౌరస్తా లో రోడ్ షో లో పాల్గొన్నారు. అల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ మహిళ జనరల్ సేక్రటరీ గా ఉన్న నగ్మ స్టార్ క్యాంపెనర్‌ గా రోడ్ షోలో పాల్గొన్నడంతో ఆమెను చూసేందుకు జ‌నం భారీగా త‌ర‌లివ‌చ్చారు. హస్తం, సైకిల్ ఎప్పుడు కలిసే ఉంటాయని..కూటమి బలపరిచి కూన వెంకటేష్ గౌడ్ కు మ‌ద్దుగా సైకిల్ గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ణాప్తి చేశారు సినీన‌టి నగ్మా.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here