సోషల్ మీడియాలో తన అనుభవాలను పంచుకున్న నటి ఉమాదేవి

0
142
Spread the love

బిగ్ బాస్ ఐదో సీజన్ రసవత్తరంగా నడుస్తోంది. గత వారం బిగ్ బాస్ షో నుంచి ఎలిమినేట్ అయిన టాలీవుడ్ నటి ఉమాదేవి తాజాగా సోషల్ మీడియాలో తన అనుభవాలను పంచుకున్నారు. బిగ్ బాస్ షో ఓ స్క్రిప్టు ప్రకారం నడుస్తుందని చాలామంది భావిస్తుంటారని, అందులో నిజంలేదని స్పష్టం చేసింది. బిగ్ బాస్… నికార్సయిన గేమ్ షో అని పేర్కొంది.

ఇక తన ఎలిమినేషన్ పట్ల ఉమాదేవి విచారం వ్యక్తం చేసింది. తాను ఉన్నది ఉన్నట్టు మాట్లాడతానని, కానీ బిగ్ బాస్ ఇంటి సభ్యులు తన మాటతీరును సరిగా అర్థం చేసుకోలేకపోయారని అభిప్రాయపడింది. బిగ్ బాస్ ఇంట్లో ఉండుంటే ఇంకా వినోదం పంచేదాన్నని, రెండో వారానికే ఎలిమినేట్ కావడం బాధాకరమని పేర్కొంది. అవకాశం ఇస్తే మళ్లీ బిగ్ బాస్ ఇంట్లోకి వెళ్లడానికి సిద్ధమేనని ప్రకటించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here