అంబేద్కర్ ఒపెన్ వర్షిటీ డిగ్రీ, పీ.జీ కోర్సులో ప్రవేశ గడువు డిసెంబర్ 31 వరకు పొడిగింపు

0
93
Spread the love

హైదరాబాద్, డిసెంబర్ 18, 2020 :
డా. బి. ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం డిగ్రీ (బీ.ఏ/బీ.కాం/బీ.ఎస్సీ), పీ.జీ (M.A., M.Com, M.Sc, M.B.A(I-CET ద్వారా), BLISc, MLISc, పీ.జీ డిప్లొమా, పలు సర్టిఫికెట్) కోర్సుల్లో చేరడానికి చివరి తేది డిసెంబర్ 31 వరకు పొడిగించినట్లు విశ్వవిద్యాలయ ఇంఛార్జి రిజిస్ట్రార్ డా. జీ. లక్ష్మారెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోని విశ్వవిద్యాలయ స్టడీ సెంటర్స్ లో ఆయా కోర్సుల్లో చేరడానికి, విద్యార్హతలు, ఫీజు తదితర వివరాలను www.braouonline.in లో పొందుపర్చినట్లు వెల్లడించారు. ఇంటర్మీడియెట్, నేషనల్ ఓపెన్ స్కూల్ సొసైటీ ద్వారా ఇంటర్ పూర్తి చేసిన వారు, యూనివర్సిటీ నిర్వహించిన అర్హత పరీక్షల్లో 2016 నుంచి 2020 వరకు పాసైన విద్యార్థులు కూడా నేరుగా డిగ్రీ కోర్సుల్లో అడ్మిషన్ పొందొచ్చని సూచించారు. ఇప్పటికే అడ్మిషన్ పొంది ఉండి వివిధ కారణాలతో సకాలంలో ట్యూషన్ ఫీజు చెల్లించలేకపోయిన డిగ్రీ కోర్సు ద్వితీయ, తృతీయ సంవత్సర విద్యార్థులు, పీజీ కోర్సుల్లో చేరి అడ్మిషన్ ఫీజు సకాలంలో కట్టలేక పోయిన వారు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని తెలిపారు.

బి-టెక్, బి.ఫార్మసీ, కోర్సులు చదవిన విధ్యార్థులు కూడా ఓపెన్ వర్సిటీలో పీజీ కోర్సు ఎం.ఏ. పొలిటికల్ సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, హిస్టరీ సోషియాలజీ, ఇంగ్లీష్, సైకాలజీ, జర్నలిజం, కోర్సులలో అడ్మిషన్ పొందొచ్చని విశ్వవిద్యాలయ అధికారులు తెలిపారు. మరిన్ని వివరాలకు 7382929570/580/590/600 లేదా విశ్వవిద్యాలయ సమాచార కేంద్రం 040-23680333 / 555 ఫోన్ నంబర్లలో సంప్రదించొచ్చని పేర్కొన్నారు.
*****

BRAOU UG & PG ADMISSIONS DATE EXTENDED :

The Direct Admission for Under Graduates (B.A/B.Com/B.Sc) and Post Graduation, M.A., M.Com., M.Sc, M.B.A(with I-CET), BLISc., MLISc., P.G. Diplomas and Certificate programmes of Dr. B. R. Ambedkar Open University (BRAOU) for the Academic year 2021-21 “through Online” is extended upto December 31, in the States of Telangana and Andhra Pradesh. Students those who are completed their Intermediate or Open Schools Society Intermediate and those who are cleared the Eligibility Test which was conducted by the University from 2016 to 2020 are also eligible to join U.G Courses. And Students those who are completed B.Tech and B.Pharmacy from any recognised university are eligible for Post Graduation Courses in Dr. B. R. Ambedkar Open University, they can take the admission into M.A., (Political science, Public Administration, History, Sociology, English, Journalism) through Online last date is December 31. For further details visit university Portal:www.braouonline.in and for more information contact Help Desk Numbers: 7382929570/580/590 and 600 or information centre : 040-23680333/555 for guidance.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here