జేమ్సబాండ్ ఆఫ్ భారత్ టోపిలో ఇదొక మ‌చ్చుక మాత్రమే

0
196
Spread the love

కరడుగట్టిన నేర చరితుడు ముంబై వరుసపేలుళ్ల సూత్రధారి దావుద్ ఇబ్రహీం మన శ్రీ దోవలు గారు చేతి నుంచి కొద్దిలో ప్రాణాలతో బయట పడ్డారా …..

అండర్ వరల్డ్ డాన్, ముంబై పేలుళ్ల సూత్రధారి, వేలకోట్ల ఆస్తులు, దాదాపుగా వరుస బాంబు పేలుళ్లలో వెయ్యికి పైనే ప్రాణాలు పోగొట్టుకున్న అమాయక జనం, ప్రభుత్వ లెక్కల ప్ర‌కారం 257 మంది చనిపోయారని, 1400 మంది వికలాంగులుగా మారారని మనకు తెలుస్తున్న లెక్కలు.

ఒక్క రెండు గంటల వ్యవధిలో ముంబైలోని 13 ప్రాంతాలలో జరిగిన ఘోర కలి. భారత దేశ ఆర్ధిక రాజధాని ప్రాంతం ఒక్కసారిగా స్మశాన వైరాగ్యాన్ని సంతరించుకున్న సమయం, 12 మార్చ్ 1993 రోజు కరాళ నృత్యం కదంతొక్కి తన ప్రతాపాన్ని ప్రకోపించిన వేళ.
మొట్టమొదటి సారి భారత దేశంలో తీవ్రవాద ఛాయలు ఈ రూపాన్ని సంతరించుకొని ఈ విధంగా కూడా జన సామాన్యాయాన్ని నిశీధి గమనంలోకి నెట్టవచ్చుననే సత్యాన్ని ప్రజా బాహుళ్యానికి తెలియపరచిపన‌ వేళ. భారత్ లోని వేగులకు ఓ పూర్తిస్థాయి సవాలు విసురుతూ ప్రజల ఉసురు తీసిన వేళ. కలుక్కుమనే గుండెలను దిటవు చేసుకొని ముందు జరుగవలసిన పరిస్థితులను, చేయవలసిన కార్యాన్ని యోజన చేయాలని సంకల్పించిన వేళ.
ముంబాయి భారత ముఖ ద్వారం. సముద్రపు అంచున వెలసిన మహా నగరం. సరుకుల దొంగరవాణా ముఖ్యంగా బంగారం దొంగ రవాణాకు ఎంతో అనువుగా మారిన నగరం. అపరిమితమైన సంపద చుసిన క్షణాన విచ్చలవిడిగా నేరం విలయ తాండవం చేస్తూ అదే వారి జీవన విధానంగా సాగుతున్న రంగుల నగరమే ముంబై అదే ఒకప్పటి బొంబాయి మహా నగరం. నేర చరిత్ర అనగానే నేరచరితులు తమ తమ నేరాలను పద్ధతి ప్రకారం చేయడం కోసం గ్యాంగులుగా మారి ఆయా ప్రదేశాలలో తమ తమ ఆధిపత్యాన్ని చెలాయించడం. ఇదే సమయంలో ఈ గ్యాంగుల మధ్యన యుద్ధ వాతావరణం.

గ్యాంగ్ వార్ తోటి కక్షలు కార్పణ్యాలు పెరిగి ఒకరిని ఒకరు చంపుకునే స్థితి ఆధిపత్య పోరాటాలు. ఈ యొక్క నేరచరితులను ఏరివేయడానికి ముంబాయి ప్రత్యేక పోలీసుదళాలు ఏర్పడి ఎన్కౌంటర్ స్పెషలిస్టులు ఈ జాతి వ్యతిరేక ముఠాలను ఏరి వేసే పరిస్థితి.

ఈ నేర చరితులు, గ్యాంగ్ వార్‌ల‌ మధ్యన ఆధిపత్య పోరులో తమ ప్రతాపం చూపడానికి కొంతమంది ముందుకు రావడం వారికి అండగా శత్రుదేశ గూఢచారి వ్యవస్థలు తమ సమర్దత‌ను వారికి తెలియచేసి వారికి కావలసిన ఆయుధ సంపత్తిని దొంగ మార్గాలు అంటే సముద్ర మార్గం ద్వారా చేరవేయడం. ఈ అపరిమిత ఆయుధ సంపత్తితోటి ఈ నేర చరితులు తమ సామ్రాజ్యాన్ని విస్తరించుకుంటూ పూర్తి స్థాయి ఆర్ధిక దిగ్బంధనానికి ప్రయాస మొదలు. చిన్న రోడ్డు ప్రక్కన వ్యాపారి నుంచి బడా వ్యాపారుల వరకు వీరికి హఫ్త ఇవ్వవలసిన పరిస్థితులు.

ఇదిగో ఇక్కడే ఒక నరరూప రాక్షసుడు, నేర సామ్రాజ్య విస్తరణ వాది, మరికొంత మంది సహచరులతో శత్రుదేశ గూఢచారి సంస్థలతో చేతులు కలిపి వారి యొక్క ఆదేశాలకు అనుగుణంగా ప్రవర్తించిన తీరు. ఇక్కడ వారు ఉపయోగించుకున్న ఒకే ఒక్క విషయం 1992 బాబ్రి మసీదు కూల్చివేత. ఇది నెపంగా ఆయొక్క తీవ్రవాద నేర గ్యాంగుల కలయికతో రూపుదిద్దుకున్న రాక్షస విలయం, ముంబైలో 13 ప్రాంతాలలో బాంబు పేలుళ్ల సంఘటన.

ఓ కానిస్టేబుల్ కుమారుడు, నొటోరియస్ స్మగ్లర్ భారత దేశంలో పోలీసుల లిస్టు లో మోస్ట్ వాంటెడ్ మనిషిగా గుర్తించబడిన వాడు దావుద్ ఇబ్రహీం. ఈ దావుద్ ఇబ్రహీంతో జత కలిసి టైగెర్ మెమొన్ అనే వ్యాపారవేత్తతో కలసి ఈ ముంబై బాంబు పేలుళ్లకు కుట్ర చేశారని అభియోగం.

అసలు ఈ బాంబు పేలుళ్లకు మూలం ఏమిటి అని ఆరా తీస్తే రెండు రకాల సమాధానాలు లభిస్తాయి. ఒకటి 1992 బాబ్రి మస్జీద్ కూల్చివేత అంటుంటే రెండవ ప్రక్కన భారత్ యొక్క ఆయువుపట్టు, ఆర్ధిక రాజధాని ముంబైని గనుక నాశనం చేస్తే భారత్ కుదేల‌వుతుంది…. తద్వారా భారత్ లో అల్లకల్లోలం సృష్టించి దేశాన్ని వశం చేసుకోవాలని శత్రు దేశాల కుట్ర పూరిత ఆలోచన అని.

ఏది ఏమైనా జరిగిన ఘోరానికి కారణం దావుద్ ఇబ్రహీం…. అయితే టైగర్ మెమొన్ ఉరితీయబడినాడు.

ఈ దావుద్ ఎక్కడ వున్నాడో అందరికి తెలిసిన విషయమే. పాకిస్తాన్ లో అక్కడి ఆర్మీ వారి సురక్షిత పర్యవేక్షణలో. ఈ దావూద్ మీద అంతర్జాతీయ వత్తిడి కూడా వున్నది.

భారత గూఢచారి వర్గాలు ఎప్పటికప్పుడు ఆయన మీద నిఘా పెట్టి ఏవిధంగా ఐనా అతని అంతం చూడాలని ప్రయాస చేస్తున్న తరుణం.

మాజీ హోమ్ సెక్రటరీ బిజెపి ఎంపీ శ్రీ ఆర్ కె సింగ్ గారి సమాచారం ప్రకారం దావుద్ ఇబ్రహీంను తుదముముట్టించడానికి భారత ఇంటెలిజెన్స్ వర్గాలు ప్రయత్నం చేశాయి కానీ ఆ ప్రయత్నాన్ని ముంబై పోలీసులు వమ్ము చేశారని తెలియ చేయడం .

వాస్తవంలోకి పోతే, శ్రీ అజిత్ దోవల్, ఐబీ ఆఫీసరుగా వారికి దావుద్ కేసు ఇవ్వడం జరిగినది. భారత ఇంటెలిజెన్స్ వర్గాలు సేకరించిన సమాచారం ప్రకారం దావుద్ కూతురు వివాహం 9 వ తేదీ జులై లో మక్కాలో జరిగే విధంగా , మరియు గ్రాండ్ హయత్ హోటల్, దుబాయ్ లో వలిమాహ (రిసెప్షన్) మరియు 23 తేదీ జులై లోను నిశ్చయం చేయడం జరిగినది అనేది సమాచారం.

వెంటనే జేమ్స్ బాండ్ దోవల్ గారు రంగంలోకి దిగారు. భారతీయ ఏజన్సీలు, వేగులు ఎవరి చేతికి మట్టి అంటుకోకుండా పథ‌క రచన జరిగిపోయింది. చోటా రాజన్ ఈయన దావుద్ ఇబ్రహీం గ్యాంగు మనిషి అయినప్పటికీ వారి మధ్యన లావాదేవీలలో కొట్లాటలు మూలకంగా విడిపోవడం తోటి ఇద్దరు బద్ద శత్రువులుగా మారడం. ఇద్దరు ఒకరిని ఒకరు చంపుకోవాలని ఎత్తులు జిత్తులు ప్రదర్శిస్తున్న సమయాన దోవల్ గారు చోటా రాజన్కు కబురు చేయడం జరిగిపోయింది.

పధకం కోసం ఇద్దరు మెరికలవంటి రాజన్ మనుషులకు గన్ ఉపయోగించడం, వెంటనే పారి పోవడం, ఎక్కడెక్కడ ఏ విధంగా ప్రవర్తించాలి, పార్టీలో ప్రవర్తించవలసిన తీరు అంతా చక చకా తర్ఫీదు ఇవ్వడం జరిగి పోయింది. వీరు ముంబైలో ఒక రహస్య ప్రదేశంలో వుండి తమ ప్రయాణానికి ఏర్పాట్లు చేసుకుంటున్న సమయాన. శ్రీ దోవల్ గారు అన్ని తానై వారి ప్రయాణ ఏర్పాట్ల పర్యవేక్షణ చేస్తున్న సమయం అది.

అనుకోని సంఘటన ముంబై పోలీసుల వేగులకు ఈ విషయం లీక్ కావడం, ముంబై పొలిసు కమిషనర్ టాస్క్ ఫోర్స్ ఆధ్వర్యంలో చక చకా దాడులు జరిగిపోయి సరిగ్గా ఈ ఆగంతకులు బయలుదేరే సమయానికి వారిని అరెస్టు చేసి వెంటనే ప్రచార సాధనాలలో వారిని గురించి తెలియచేయడం జరిగిపోయినదని శ్రీ ఆర్కే సింగ్ గారు, బిజెపి ఎంపీ గారు తెలియపరచడం జరిగింది. ఈ పట్టుబడిన వారు కరడుగట్టిన నేరమూతకు చెందిన షార్ప్ షూటరులు అని. ముంబై లో కొంతమంది పెద్దలను కడతేర్చడానికి వీరిని చోటా రాజన్ ఏర్పాటు చేశారని అందరికి తెలియ చేయడం జరిగిపోయింది.

విషయం వెంటనే తెలుసుకున్న శ్రీ దోవల్ గారు ముంబైలో ఆరోజు కమిషనరు గారితో యుద్ధం చేసినంత చేశారని శ్రీ సింగ్ గారు విలేకరుల సమావేశంలో తెలియపరిచారు. ఆ విధంగా కరడుగట్టిన నేరచరితుడు, ముంబై బాంబు పేలుళ్ల సూత్రధారి మన దోవల్ గారు ఉక్కు పిడికిళ్లనుంచి ప్రాణాపాయం లేకుండా తప్పించుకోవడం దైవేచ్చనే. లేదంటే 2005 వ సంవత్సరంలోనే దావుద్ ఇబ్రహీం దారుణంగా హత్య కావించబడి చంపివేయబడేవాడు. ఈ మధ్యన మనం ఒక హీరోగారి చిత్రంలో ఈ విధమైన సన్నివేశాన్ని చూశాము. ఈ ఉదంతం సినిమాకు కూడా అందనంత రహస్య ప్రయాస అయినప్పటికీ కొంతమంది దావుద్ అనుచరులు ముంబై పోలీసులతో వుండి వారి వలన మొత్తం ఆపరేషన్ తప్పిపోయి నేరస్థులు తప్పించుకోవడం దురదృష్టకరమే.
ఇంటిదొంగలను ఓ కంట కనిపెట్టి వుండి ఆ విధంగా వారిని విఫలం చేయగలిగితే గాని విజయం సాధించడం కష్టమే. ఎంతటి గొప్ప మేధావులైనప్పటికీ కొన్నిసార్లు వారి ప్రయత్నాలు ఇలాటి స్వార్థపరుల చేతిలో ఫెయిల్ కావడం జరుగుతూనే ఉంటుంది. కొసమెరుపు శ్రీ దోవల్ గారిని విలేఖరులు ఈ విషయంగా ఆరా తీయగా ఆ సమయంలో నేను ఇంట్లో టివి చూస్తూ గడుపుతున్నాను నాకు దానిగురించి ఏమి తెలియదు అని తెలపడమే. జేమ్సబాండ్ ఆఫ్ భారత్ టోపిలో ఇదొక మ‌చ్చుక మాత్రమే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here