ఆకాశ‌వాణి హైద‌రాబాద్ కేంద్రానికి జాతీయ పుర‌స్కారం

0
299
Spread the love

ఆకాశ‌వాణి హైద‌రాబాద్ కేంద్రానికి జాతీయ పుర‌స్కారం

హైదరాబాద్, అక్టోబర్ 17, 2018

‘‘కాలం’’ సృజ‌నాత్మ‌క రేడియో రూప‌కం:

కాలం ద‌యామ‌యి.. కాలం నిర్ద‌యి.. కాలం ఒక అనంత ప్ర‌వాహం.. కాలం జ‌న‌నం… కాలం మ‌ర‌ణం.. కాలం ఒక అనుభ‌వం.. కాలం ఒక స్మృతి…

కాలానికి ఉన్న అనేక ప‌ర్శ్వాల‌ను సృజ‌నాత్మ‌క రూప‌కం గా ఆకాశ‌వాణి హైద‌రాబాద్ కేంద్రం మ‌లచిన కార్య‌క్ర‌మం ‘‘కాలం’’ ఈ సంవ‌త్స‌రం ఆకాశ‌వాణి వార్షిక పోటీల‌లో దేశ‌వ్యాప్తంగా అన్ని భాష‌ల‌ లో వ‌చ్చిన ఎంట్రీల‌ లో అత్యున్న‌త కార్య‌క్ర‌మంగా ఎంపికై, జాతీయ స్థాయిలో ప్ర‌థ‌మ బ‌హుమ‌తి పొందింది. ఆకాశ‌వాణి హైద‌రాబాద్ కేంద్రం సీనియ‌ర్ అనౌన్స‌ర్ శ్రీ అంబ‌డిపూడి ముర‌ళీకృష్ణ ఈ కార్య‌క్ర‌మ రూప‌క‌ర్త‌, ప్ర‌యోక్త‌. ఈ రూప‌కాన్ని శ్రీ ఆకెళ్ళ శివ‌ప్ర‌సాద్ ర‌చించారు. సాంకేతిక స‌హ‌కారాన్ని శ్రీ ఎన్‌. చ‌ల‌ప‌తి రావు, నిర్మాణ స‌హ‌కారాన్ని శ్రీ జె. అనిల్ కుమార్ అందించారు. ఈ శ్రీ అంబ‌డిపూడి ముర‌ళీకృష్ణ కు గ‌తంలో USE & THROUGH, విశ్వ‌గురు, గంగిరెద్దు కార్య‌క్ర‌మాల‌కు కూడా గ‌తంలో జాతీయ పుర‌స్కారాలు ల‌భించాయి.

ఈ రోజు ఆకాశ‌వాణి హైద‌రాబాద్ కేంద్రంలో అంబ‌డిపూడి ముర‌ళీకృష్ణ కు ఆత్మీయ స‌త్కారం జ‌రిగింది. ప్రోగ్రామ్ హెడ్ వి. ఉద‌య‌శంక‌ర్ అధ్య‌క్ష‌త‌న జ‌రిగిన ఈ స‌మావేశం లో ప్రోగ్రామ్‌, ఇంజ‌నీరింగ్‌, అడ్మినిస్ట్రేష‌న్ విభాగాల సిబ్బంది పాల్గొని శ్రీ అంబ‌డిపూడి ముర‌ళీకృష్ణ కు త‌మ శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు.

ఈ కార్యక్ర‌మంలో శ్రీ సి.హెచ్‌. దేవ‌దాస్‌, డాక్ట‌ర్ కె. విజ‌య‌, డా. నాగ‌సూరి వేణుగోపాల్‌, శ్రీ చంటిబాబు, శ్రీ విజ‌య‌రాఘ‌వ రెడ్డి, శ్రీ సి.ఎస్‌. రాంబాబు, శ్రీ సి.హెచ్‌. నాగ‌రాజు త‌దిత‌రులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here