హైద్రాబాద్‌లో కిడ్నాప్: మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్

0
346
Spread the love

మాజీ మంత్రి భూమా అఖిలప్రియను పోలీసులు అరెస్ట్ చేశారు.హైద్రాబాద్ కూకట్‌పల్లిలో సీఎం కేసీఆర్ బంధువుల కిడ్నాప్ కేసులో భూమా అఖిలప్రియను పోలీసులు అరెస్ట్ చేశారు.

కిడ్నాప్ సమయంలో ఏం జరిగింది, కిడ్నాపర్లను ఎలా గుర్తించారు, ఎవరి హస్తం ఉందనే విషయమై పోలీసులు ఆరా తీస్తున్నారు. హఫీజ్‌పేటలోని 50 ఎకరాల భూమి వ్యవహారమే కారణంగా పోలీసులు అనుమానిస్తున్నారు.
భూమా నాగిరెడ్డి బతికున్న సమయం నుండి ఈ భూ వివాదం కొనసాగుతోంది. ప్రవీణ్ రావుతో పాటు అతని సోదరులు నవీన్, సునీల్ స్టేట్‌మెంట్ రికార్డు చేసుకొన్నారు.

సెటిల్ మెంట్ లో అఖిలప్రియ భర్త భార్గవ్ సోదరుడి పాత్ర ఉందనే పోలీసులు అనుమానిస్తున్నారు. ఐటీ అధికారుల పేరుతో వచ్చి ఈ ముగ్గురిని కిడ్నాప్ చేశారు. ప్రవీణ్ రావు, నవీన్, సునీల్ రావుల నుండి స్టేట్ మెంట్ ఆధారంగా అఖిలప్రియను పోలీసులు అరెస్ట్ చేశారు.

అఖిలప్రియతో పాటు ఆమె భర్త భార్గవ్ రామ్ ను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. టెక్నికల్ ఎవిడెన్స్ ను కూడ పోలీసులు సేకరిస్తున్నారు.

కిడ్నాపర్లను వికారాబాద్ లో కూడ పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు. కిడ్నాపర్లను కూడ పోలీసులు విచారిస్తున్నారు. బోయిన్ పల్లి పోలిస్ స్టేషన్ కు అఖిలప్రియను పోలీసులు తీసుకొస్తున్నారు.

CP Anjani Kumar Press Meet

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here