ఛైర్ పర్సన్ గా బాధ్యతలు చేపట్టిన ఆకుల లలితా

0
254
Spread the love


రాష్ట్ర మహిళా ఆర్థిక సహకార సంస్థ ఛైర్ పర్సన్ గా బాధ్యతలు చేపట్టిన ఆకుల లలితా

## హాజరైన ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్, మంత్రి సత్యవతి రాథోడ్, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ప్రభుత్వ విప్ లు గంప గోవర్ధన్, ప్రభాకర్, తదితరులు

రాష్ట్ర మహిళా ఆర్థిక సహకార సంస్థ చైర్ పర్సన్ గా మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలితా రాఘవేందర్ శుక్రవారం పదవీ బాధ్యతలు చేపట్టారు.

జూబ్లీహిల్స్ లోని కార్యాలయంలో పూజలు నిర్వహించిన అనంతరం ఫైల్ పై సంతకం చేశారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్, గిరిజన సంక్షేమ, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్, నిజామాబాద్ జిల్లా ఎమ్మెల్సీలు కల్వకుంట్ల కవిత, వీజీ గౌడ్, ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ప్రభుత్వ విప్ లు గంప గోవర్ధన్, ప్రభాకర్, మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ ఎం. శ్రీనివాస్ రెడ్డి, నిజామాబాద్ జిల్లాలోని స్థానిక ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆకుల లలితా మాట్లాడుతూ తనపై విశ్వాసంతో సీఎం కేసీఆర్ అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తానని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లో విస్తృతంగా తీసుకెళ్తానని అన్నారు. మహిళల సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందించి వాటి పరిష్కారానికి కృషి చేస్తానని ఆకుల లలితా పేర్కొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here