భారతీయులందరికీ కోవిడ్-19 వ్యాక్సిన్ ఉచితం : కేంద్ర మంత్రి హర్షవర్ధన్

0
116
covid-vaccine-free-distribution
Spread the love

కోవిడ్-19 వ్యాక్సిన్ భారతీయులందరికీ ఉచితంగానే పంపిణీ చేస్తామని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్దన్ శనివారం చెప్పారు. ఢిల్లీలోని దరియాగంజ్‌లో మెటర్నిటీ అండ్ చైల్డ్ వెల్ఫేర్ సెంటర్‌లో వ్యాక్సినేషన్ డ్రై రన్ తీరును సమీక్షించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ దేశవ్యాప్తంగా అందరికీ కోవిడ్-19 వ్యాక్సిన్‌ను ఉచితంగా ఇస్తామన్నారు.
ఢిల్లీలో మాదిరిగా దేశవ్యాప్తంగా కోవిడ్-19 వ్యాక్సిన్‌ను ఉచితంగా పంపిణీ చేస్తారా? అని విలేకర్లు అడిగినపుడు డాక్టర్ హర్షవర్ధన్ మాట్లాడుతూ, ఢిల్లీలోనే కాదు, ఇది దేశవ్యాప్తంగా ఉచితమేనని చెప్పారు. అంతకుముందు ఆయన గురు తేజ్ బహదూర్ హాస్పిటల్‌లో డ్రై రన్‌ను సమీక్షించారు.
ఢిల్లీలో మొత్తం మూడు చోట్ల డ్రై రన్ నిర్వహిస్తున్నారు. గురు తేజ్ బహదూర్ హాస్పిటల్‌, మెటర్నిటీ అండ్ చైల్డ్ వెల్ఫేర్ సెంటర్‌, వేంకటేశ్వర హాస్పిటల్‌లలో డ్రై రన్ నిర్వహిస్తున్నారు.

డ్రై రన్‌లో వ్యాక్సిన్‌ను ఇవ్వడం మినహా మిగతా కార్యకలాపాలను నిర్వహిస్తారు. వ్యాక్సిన్ తీసుకునేవారి పేరు నమోదు చేయడం, వ్యాక్సిన్ తీసుకున్న వ్యక్తికి విశ్రాంతి కల్పించడం, ఆ వ్యక్తికి ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ వస్తే ఏం చేయాలి? వంటివాటిని ప్రయోగాత్మకంగా నిర్వహిస్తారు.

ఆక్స్‌ఫర్డ్-ఆస్ట్రాజెనెకా అభివృద్ధిపరచిన వ్యాక్సిన్‌ను నిపుణుల కమిటీ సిఫారసు చేసింది. ఈ సిఫారసులను డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా ఆమోదం కోసం పంపించారు. త్వరలోనే ఈ సిఫారసులపై డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా సిఫారసులు వస్తాయని హర్షవర్ధన్ చెప్పారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం వ్యాక్సినేషన్ జనవరి 6 నుంచి ప్రారంభమవుతుందని తెలుస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here