*ఎన్నిక‌ల‌కు ఏర్పాట్లు పూర్తి – డీఆర్‌సి కేంద్రాల‌ను త‌నిఖీ చేసిన దాన‌కిషోర్‌*

0
246
Spread the love
*ఎన్నిక‌ల‌కు ఏర్పాట్లు పూర్తి – డీఆర్‌సి కేంద్రాల‌ను త‌నిఖీ చేసిన దాన‌కిషోర్‌*
 
 శాస‌న స‌భ‌కు శుక్ర‌వారం జ‌ర‌గ‌నున్న పోలింగ్‌కు ఏర్పాట్లు పూర్తి అయ్యాయ‌ని హైద‌రాబాద్ జిల్లా ఎన్నిక‌ల అధికారి, జీహెచ్ఎంసీ క‌మిష‌న‌ర్ ఎం.దాన‌కిషోర్ తెలిపారు. నేడు ఎల్బీ స్టేడియంలో ముషిరాబాద్‌, నాంప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గాల‌కు సంబంధించిన డిస్ట్రిబ్యూష‌న్ కేంద్రాన్ని ప‌రిశీలించారు. ఈ సంద‌ర్భంగా దాన‌కిషోర్ మాట్లాడుతూ హైద‌రాబాద్‌లోని మొత్తం 3,873 పోలింగ్ కేంద్రాలకు సంబంధించి పోలింగ్ సిబ్బంది నియామ‌కం, ఈవీఎంల కేటాయింపు, క‌నీస మౌలిక స‌దుపాయాలు, దివ్యాంగుల‌కు ప్ర‌త్యేక ఏర్పాట్లు, బందోబ‌స్తు ఏర్పాట్ల‌న్నీ పూర్తి అయ్యాయ‌ని వివ‌రించారు. హైద‌రాబాద్ జిల్లాలో 15 నియోజ‌క‌వ‌ర్గాల్లో 313మంది అభ్య‌ర్థులు పోటీలో ఉన్నార‌ని తెలిపారు. హైదరాబాద్ జిల్లాలోని 15 నియోజ‌క‌వ‌ర్గాల్లో 40,57,488 మంది ఓట‌ర్లు ఉండ‌గా వీరిలో దాదాపు 98శాతానికిపైగా ఓట‌రు స్లిప్‌ల‌ను పంపిణీ చేశామ‌ని తెలియ‌జేశారు. న‌గ‌రంలోని 532 క్రిటిక‌ల్ పోలింగ్ లొకేష‌న్ల‌లో మైక్రో అబ్స‌ర్‌వ‌ర్ల‌ను నియమించామ‌ని, ఈ క్రిటిక‌ల్ పోలింగ్ కేంద్రాల ఆవ‌ర‌ణ‌లో సిసి కెమెరాల ఏర్పాటు కూడా చేప‌ట్టామ‌ని చెప్పారు. అన్ని పోలింగ్ స్టేష‌న్ల‌లో లైవ్ వెబ్‌కాస్టింగ్ ఏర్పాటు చేసిన‌ట్టు తెలిపారు. హైద‌రాబాద్ జిల్లాలో 1,404 క్రిటిక‌ల్ పోలింగ్ స్టేష‌న్లు, 532 క్రిటిక‌ల్ లొకేష‌న్లు, 17 స‌మ‌స్యాత్మ‌క పోలింగ్ కేంద్రాలుగా గుర్తించామ‌ని తెలిపారు. ప్ర‌తి అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గంలో రెండు మోడ‌ల్ పోలింగ్ స్టేష‌న్ల‌ను ఏర్పాటు చేశామ‌ని తెలిపారు. అన్ని పోలింగ్ స్టేష‌న్ల వ‌ద్ద ర్యాంప్‌ల నిర్మాణం, ఇత‌ర స‌దుపాయాలు క‌ల్పించ‌డంతో పాటు విక‌లాంగుల‌కు ఉచిత ర‌వాణ సౌక‌ర్యం క‌ల్పించామ‌ని పేర్కొన్నారు. పోలింగ్ సంద‌ర్భంగా విధుల్లో ఉన్న పోలింగ్ సిబ్బందికి ఏవిధ‌మైన అసౌక‌ర్యం క‌లుగ‌కుండా చ‌ర్య‌లు చేప‌ట్టామ‌ని తెలియ‌జేశారు. ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌కు గాను 4,468 కంట్రోల్ యూనిట్లు, 8,574 బ్యాలెట్ యూనిట్లు, 4,861 వివిప్యాట్‌లు పంపిణీ చేశామ‌ని తెలిపారు. ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌కు సంబంధించి వ‌చ్చే ఫిర్యాదుల‌పై త‌క్ష‌ణ‌మే స్పందిస్తున్నామ‌ని తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here