కౌంటింగ్ కు అంతా సిద్ధం చేశారు ఎన్నిక‌ల అధికారులు

0
423
Spread the love

తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు ఎక్క‌డ చూసినా ఎన్నిక‌ల‌పైనే చ‌ర్చ జ‌రుగుతోంది. రేపు అన‌గా డిసెంబర్ 11 మంగళవారం రోజున జరిగే అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ కోసం ఇక్క‌డి ప్రజలే కాదు.. దేశం మొత్తం ఎదురుచూస్తోంది. కౌంటింగ్ కు అంతా సిద్ధం చేశారు అధికారులు. నియోజకవర్గాల్లోని స్ట్రాంగ్ రూమ్ లలో ఈవీఎంలు, వీవీ ప్యాట్ బాక్స్ లు భద్రంగా ఉన్నాయి. రేపు ఉదయం 8 గంటలకు ఈవీఎంలను ఓపెన్ చేసి లెక్కింపు ప్రారంభిస్తారు అధికారులు. కౌంటింగ్ సెంటర్ల దగ్గర సీసీటీవీలు, కేంద్ర బలగాలు, రాష్ట్ర పోలీసు బలగాలతో నిరంతరం గస్తీ పెట్టారు. కౌంటింగ్ ఏర్పాట్ల‌ను, బందోబ‌స్తును హైద‌రాబాద్ జిల్లా ఎన్నిక‌ల అధికారి, జీహెచ్ఎంసీ క‌మిష‌న‌ర్ ఎం.దాన‌కిషోర్‌, న‌గ‌ర పోలీస్ క‌మిష‌న‌ర్ అంజ‌నీకుమార్ త‌దిత‌ర పోలీస్ అధికారుల‌తో క‌లిసి పరిశీలించారు. కౌంటింగ్ రోజున కౌంటింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుంది. కౌంటింగ్ రోజున వైన్ షాపులు మూసివేయాలి. ఈ మేరకు పోలీసులు ఇప్పటికే నోటిఫికేషన్ ఇచ్చారు. కౌంటింగ్ తేదీన ఎలాంటి సభలు, ర్యాలీలకు అనుమతి లేదు. కౌంటింగ్ కేంద్రానికి దగ్గర్లో అనుమతి లేకుండా వాహనాలను పార్కింగ్ చేయడానికి వీల్లేదు. పట్టణాలు, నగరాల్లో… కౌంటింగ్ సెంటర్లకు-బ్యారికేడ్లు పెట్టి వాహనాలు నిలిపిన ప్రాంతానికి షటిల్ సర్వీసులు నడుపుతారు. వాటితో కౌంటింగ్ సెంటర్ కు ఏజెంట్లు చేరుకోవచ్చు. కౌంటింగ్ సెంటర్ లోకి సెల్ ఫోన్లు తీసుకురాకూడదు. కౌంటింగ్ కేంద్రాల్లోకి పాస్ లు ఉన్నవారికి మాత్రమే అనుమతి ఉంటుంది. రేపు మ‌ధ్య‌హ్నం క‌ల్లా దాదాపు ఫ‌లితాలు వెలువ‌డే అవ‌కాశం ఉంది. కౌంటింగ్ కేంద్రాల వద్ద మూడంచెల భద్రత వ్యవస్థ ఉంటుంది. మొదటి అంచెలో కౌంటింగ్ కేంద్రంవైపు వచ్చే వాహనాలను మొదట పోలీసులు తనిఖీ చేస్తారు. ఆ తర్వాత పాస్ ఉన్నవారిని మాత్రమే లోపలికి పంపిస్తారు. రెండవ అంచెలో కౌంటింగ్ సెంటర్ కు అర కిలోమీటర్ పరిధిలో బారికేడ్లు పెట్టి బందోబస్తు నిర్వహిస్తారు. ఇక్కడ భద్రతా బలగాలు గస్తీ కాస్తాయి. మూడవ అంచెలో సీసీ కెమెరాలు, కేంద్ర భద్రతా బలగాలు, పోలీసులతో కట్టుదిట్టమైన భద్రత ఉంటుంది.
కౌంటింగ్ ఏజెంట్లు ఏడు గంటల లోపే కౌంటింగ్ కేంద్రాలకు చేరుకోవాలి. పార్టీల ఏజెంట్లకు రిటర్నింగ్ అధికారులు పాసులు ఇస్తారు. పట్టణాలు, నగరాల్లో… కౌంటింగ్ సెంటర్లకు-బ్యారికేడ్లు పెట్టి వాహనాలు నిలిపిన ప్రాంతానికి షటిల్ సర్వీసులు నడుపుతారు. వాటితో కౌంటింగ్ సెంటర్ కు ఏజెంట్లు చేరుకోవచ్చు. కౌంటింగ్ సెంటర్ లోకి సెల్ ఫోన్లు తీసుకురాకూడదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here