*పోలింగ్ కు సర్వం సిద్ధం… ఉ.8 నుండి సా.4 గం. వరకు పోలింగ్*

0
250
Spread the love

*పోలింగ్ కు సర్వం సిద్ధం… ఉ.8 నుండి సా.4 గం. వరకు పోలింగ్*

హైదరాబాద్, మార్చ్ 13 ::  మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ శాసన మండలి పట్టభద్రుల నియోజకవర్గానికి ఆదివారం (14 న ) జరిగే పోలింగ్ కు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.నేడు ఎల్.బి. స్టేడియంలోని ఇండోర్ స్టేడియం లో ఏర్పాటు చేసిన పోలింగ్ సామాగ్రి పంపిణి కేంద్రం ద్వారా ఎన్నికల సిబ్బందికి జంబో బ్యాలెట్ బాక్స్ లతో పాటు జంబో బాలెట్ పేపర్లు, ఇతర పోలింగ్ సామాగ్రిని అందచేశారు. రిటర్నింగ్  ఆఫీసర్, జీహెచ్ఎంసీ అడిషనల్ కమీషనర్ ప్రియాంక అలా పర్యవేక్షణలో జరిగిన ఈ ఎన్నికల సామాగ్రి పంపిణి కార్యక్రమాన్ని ఎన్నికల పర్యవేక్షకులు హరి ప్రీత్ సింగ్ పరిశీలించారు. ప్రతి పోలింగ్ స్టేషన్ కు ఎన్నికల సిబ్బందిని, సామాగ్రిని తరలించేందుకు ప్రత్యేక వాహనాలను ఏర్పాటు చేశారు.ఎన్నికల విధులకు హాజరైన పిఓ , ఏ.పి.ఓ, మైక్రో అబ్జర్వర్ లలో ఓటు ఉన్న వారికి  పోస్టల్ బాలెట్ సౌకర్యాన్ని కల్పించారు. కాగా, పోలింగ్ ముగియగానే బ్యాలెట్ బాక్సుల స్వీకరించే సరూర్ నగర్ ఇండోర్ స్టేడియాన్ని హైదరాబాద్ ఎన్నికల అధికారి లోకేష్ కుమార్, రిటర్నింగ్   అధికారి ప్రియాంక అలా లు పరిశీలించారు. ఈ స్టేడియంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్ లను, బాలెట్ బాక్సులను స్వీకరించేందుకు చేసిన ఏర్పాట్లను పరిశీలించారు. రేపు పోలింగ్ ముగిసిన వెంటనే సాయంత్రం నాలుగున్నర నుండే సమీపంలోని బాలెట్ బాక్సులు వస్తాయని, ప్రతి జిల్లా వారీగా ప్రత్యేక సిబ్బందిని, పర్యవేక్షక అధికారులను ఏర్పాటు చేసి బాలెట్ బాక్సులు జాగ్రత్తగా స్ట్రాంగ్ రూమ్ లకు తరలించాలని అన్నారు.
*ఉదయం 8 గంటలకు పోలింగ్ ప్రారంభం.

*మండలి ఎన్నికకు ఉదయం 8 గంటలనుండి సాయంత్రం 4 గంటలవరకు పోలింగ్ నిర్వహిస్తారు.
*పోటీలో 93 మంది అభ్యర్థులు ఉన్నందున బారి సైజు బాలెట్ పేపర్లు ముద్రించి, జంబో బాక్సులు ప్రత్యేకంగా తయారు చేయించారు.
*ఓటు వేసిన వారికి ఎడమ చేయి చూపుడు వేలిపై సిరా గుర్తు వేస్తారు.
*పోలింగ్ అధికారులు ఇచ్చిన పెన్నుతోనే వోటింగ్ ప్రాధాన్యతా నెంబర్లను వేయాలి
*మొదటి ప్రాధాన్యతా నెంబర్ (1 ) ను మాత్రం తప్పని సరిగా వేయాలి.
*ఒక అంకెను ఒకే అభ్యర్థికి మించి వేయకూడదు.
*అంకెలు వేయకుండా సంతకం చేసినా, వేలిముద్ర వేసినా, ఇతర మార్కులతో వేసినా, బాలెట్ పేపర్ పై ఏదైనా రాసినా ఆ ఓటు చెల్లుబాటు కాదు.
*బాలెట్ లో నోటా కు అవకాశం లేదు.
*మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ గ్రాడ్యుయేట్ స్థానంలో మొత్తం 5,31, 268 ఓటర్లు, 799 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here