ప్రపంచ దేశాలకు 8 కోట్ల కొవిడ్‌ టీకా డోసులు: అమెరికా అధ్యక్షుడు జోబైడెన్‌

0
83
Spread the love

ప్రపంచ దేశాలకు 8 కోట్ల కొవిడ్‌ టీకా డోసులు: అమెరికా అధ్యక్షుడు జోబైడెన్‌

వాషింగ్టన్‌ మే 18 (ఎక్స్ ప్రెస్ న్యూస్ );: ప్రపంచ దేశాలకు 8 కోట్ల కొవిడ్‌ టీకా డోసులు అందజేయనున్నట్లు అమెరికా అధ్యక్షుడు జోబైడెన్‌ ప్రకటించారు. ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్‌తో పాటు ఫైజర్‌ బయో ఎన్‌టెక్‌, మోడెర్నా, జాన్సన్‌ అండ్‌ జాన్స్‌ టీకాలు సైతం వచ్చే ఆరువారాల్లో అందించనున్నట్లు సోమవారం తెలిపారు. ప్రపంచ దేశాల్లో మహమ్మారి వ్యాప్తి తీవ్రంగా ఉంటే.. అమెరికా సైతం క్షేమంగా ఉండలేదని పేర్కొన్నారు. వచ్చే ఆరువారాల్లో 80 మిలియన్ల టీకా డోసులు ప్రపంచ దేశాలకు సరఫరా చేస్తాంఅని ట్వీట్‌ చేశారు.ప్రస్తుతం అమెరికాలో ఫైజర్‌, మోడెర్నా, జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ వ్యాక్సిన్లు వినియోగిస్తున్నారు. ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్‌కు ఆమోదం లభించలేదు. 60 మిలియన్‌ మోతాదుల నిల్వ ఉండగా.. ఫుడ్‌ అండ్‌ డ్రగ్‌ అథారిటీ (ఎఫ్‌డీఏ) క్లియరెన్స్‌ కోసం ఎదురు చూస్తోంది. అనుమతి లభిస్తే కంపెనీ వాటిని వివిధ దేశాలకు రవాణా చేయనుంది. 80 మిలియన్‌ డోసులు దేశంలోని టీకా ఉత్పత్తిలో 13 శాతం (జూన్‌ చివరి నాటికి) అని, రష్యా, చైనా కంటే ఎక్కువగా అమెరికా టీకాలను విరాళంగా ఇస్తుందని బైడెన్‌ పేర్కొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here