మ‌న వైద్య వ్య‌వ‌స్థ‌పై న‌మ్మ‌కం స‌న్న‌గిల్లింది… అందుకే ఆనందయ్య ఆయుర్వేదంపై న‌మ్మ‌కం క‌లిగింది!

0
170
Spread the love

మ‌న వైద్య వ్య‌వ‌స్థ‌పై న‌మ్మ‌కం స‌న్న‌గిల్లింది…

అందుకే ఆనందయ్య ఆయుర్వేదంపై న‌మ్మ‌కం క‌లిగింది!

బొనిగె ఆనందయ్య గారి నాటు వైద్యం కోసం లక్షల మంది ఎందుకు ఎగబడుతున్నారు. ఏ సౌకర్యాలు లేకున్నా ఎండలో కిలో మీటర్ల మేర ఎందుకు బారులు తీరుతున్నారు. ఏ శాస్త్రీయ పరిశోధన లేకుండా మందు పంపిణీని ఎలా అనుమతిస్తారని విమర్శించేవారు స్వరాలు పెంచుతున్నా ఎవరూ వెనకడుగు వేయడం లేదు. నిజమే అది పని చేస్తుందా లేదా అన్నది తేలాల్సిందే. హానికరం మాత్రం కాదని ప్రభుత్వ ఆయుష్ వైద్యులు స్పష్టం చేసారు. ఏం చదువుకున్నాడో తెలియదు. దాని గురించి ఏ ఆయుర్వేద, సిద్ధ వైద్య గ్రంథాల్లో ప్రస్తావన లేదు. అయినా జనం ఎందుకు పోటెత్తుతున్నారంటే. అన్ని విధాలా విఫలమైన మన ఆరోగ్య వ్యవస్థపై నమ్మకం కోల్పోయి. లక్షలు గుంజుతున్న ప్రైవేటు ఆసుపత్రుల దోపిడికి విసిగి పోయి. ఆక్సిజన్ దొరకని నిస్పహాయ పరిస్థితుల నుంచి బయటపడాలని, వ్యాక్సిన్లు ఇవ్వలేని ప్రభుత్వాల ముందు చూపు లేని తనాన్ని భరించలేక… చిమ్మ చీకట్లో ఆశా కిరణంలా కనిపించిన ఆనందయ్య నిజంగా దేవుడిలా అనిపించాడు. అంబులెన్సులు లేవు. బెడ్లు లేవు. సంతోషంగా ఇసుక మేటల్లో పడుకుని కళ్లలో మందు వేయించుకుంటున్నారు. ఔషద కంపెనీలకు, వ్యాక్సిన్ తయారీ దారులకు అమ్ముడు పోయిన ICMR ఏ రిపోర్ట్ అయినా ఇవ్వనీయండి. ఆనందయ్యను నమ్మే వారికి కొదవుండదు. మందు ఏమేరకు పనిచేస్తుంది అనేది తర్వాత సంగతి. ధైర్యం ఇచ్చే ఒక మనిషి కావాలి. మానసికంగా కుంగి పోయి, అలిసి పోయిన పేదలకు భరోసా కావాలి. ఆయన మందుతో పాటు ఇది పుష్కలంగా దొరుకుతుంది.

ఎవరో డాక్టర్ పి.V. రమేశంట. Drugs and Magic Remedies (Objectionable Advertisements) Act, 1954 పేరు చెప్పి ఈ మందును పంపిణీ చేయడం శిక్షార్హమైన నేరమని టీవీ చర్చల్లో బెదిరిస్తున్నాడు. మ్యాజిక్ రెమిడీస్ యాక్ట్ నుంచి వంశ పారంపర్య నాటు వైద్యాలకు, ఆయుర్వేద, సిద్ధ,యునాని, హోమియా వైద్యాలకు మినహాయింపు ఉంది. ఆ యాక్టులో ప్రస్వావించిన 54 జబ్బులు, రుగ్మతల్లో కోవిడ్ లేదు. మీరే క్లోరోక్విన్ పనిచేస్తుందన్నారు. తూచ్ అని ట్రీట్ మెంట్ ప్రోటోకాల్ నుంచి తొలగించారు, ప్లాస్మా పనికి రాదన్నారు. రెడ్మిసిర్ దివ్యౌషమని చెప్పినోళ్లు వేస్ట్ అంటుంటే మిమ్మల్నెలా నమ్మాలి. ఎందుకు చస్తున్నారో తెలియదు. బతికి బట్ట కడితే మున్ముందు ఏ సమస్యలొస్తాయో అంతు పట్టదు.

Writes – Govind Reddy – Senior Journalist

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here