32 అన్నపూర్ణ క్యాంటీన్లలో  సిట్టింగ్ ఏర్పాటు

0
29
Spread the love
 
32 అన్నపూర్ణ క్యాంటీన్లలో  సిట్టింగ్ ఏర్పాటు


హైదరాబాద్, జనవరి 04: 
  ఏ ఒక్కరూ కూడా ఆకలితో అలమటించవద్దని ముఖ్యమంత్రి సంకల్పంతో గ్రేటర్ హైదరాబాద్ లో ప్రారంభించిన ఐదు రూపాయల భోజన పథకం 373 కేంద్రాల ద్వారా  భోజనాన్ని అందజేశారు. 2020 -21 ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు  1,76,14,332 మందికి ఐదు రూపాయల భోజనాన్ని  పంపిణీ చేశారు.

జిహెచ్ఎంసిలో  పరిధిలో  ఏర్పాటు చేసిన అన్నపూర్ణ కేంద్రాల ద్వారా నాణ్యతతో కూడిన సురక్షితమైన ఆహారాన్ని అందజేస్తున్నారు.
2014 సంవత్సరంలో జిహెచ్ఎంసి వ్యాప్తంగా 8 సెంటర్ లను ప్రయోగాత్మకంగా 5 రూపాయల  భోజనాన్ని  ప్రారంభించి ఏడు సంవత్సరాల పాటు నిర్విరామంగా పేదల ఆకలిని కనీస అవసరాలను తీరుస్తున్నది. అప్పటి నుండి 7 కోట్ల 41 లక్షల 28 వేల 577 మందికి భోజన వసతి కల్పించారు. కోవిడ్ -19 సమయం లాక్ డౌన్ సందర్భంగా నిరాశ్రయులు, వలస కార్మికులు, నిరుపేదలకు ఉచితంగా భోజన వసతి కల్పించారు. వారి కోసం ప్రత్యేకంగా  259 కేంద్రాలను ఏర్పాటు చేసి ఉచితంగా భోజనాన్ని పంపిణీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కరోనా నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా వలస కార్మికులకు నిరాశ్రయులను ఆదుకున్న విషయం తెలిసిందే. వలస కార్మికులకు దేశంలో మరెక్కడా లేని విధంగా ప్రభుత్వ ఖర్చులతో వారి వారి సొంత ఊళ్లకు పంపించిన ఘనత దక్కుతుంది.

ఈ నేపథ్యంలో అన్నపూర్ణ కేంద్రాల్లో  కనీస వసతులు కల్పించేందుకు  చర్యలు చేపట్టింది. అనువైన 32 కేంద్రాల్లో  సీట్టింగ్ ఏర్పాట్లు చేస్తున్నారు. జోన్ల వారీగా ఒక్కొక్క కేంద్రంలో సుమారు 10 లక్షల ఖర్చుతో వ్యయంతో చేపట్టనున్నారు.

 32 అన్నపూర్ణ క్యాంటీన్లలో సీట్టింగ్ ఏర్పాటు  ప్రతిపాదనలు వివరాలు

 ఎల్బి నగర్ జోన్:  ఎల్బి నగర్ లో కాప్ర, ఉప్పల్ హయత్ నగర్, సరూర్ నగర్, ఎల్.బి నగర్ లో  ఏర్పాటు చేయనున్నారు

చార్మినార్ జోన్:  చార్మినార్ లో  మలక్ పేట్, సంతోష్ నగర్, చాంద్రాయణగుట్ట, చార్మినార్,  ఫలక్ నామ, రాజేంద్రనగర్ సర్కిల్ లో ఏర్పాటు చేయనున్నారు.

ఖైరతాబాద్ జోన్:
 ఖైరతాబాద్ జోన్ లో  కార్వాన్, గోషామహాల్, ఖైరతాబాద్, జూబ్లీహిల్స్, మెహిదీపట్నం లలో ఏర్పాటు చేయనున్నారు.

 శేరిలింగంపల్లి జోన్: శేరిలింగంపల్లి జోన్ లో శేరిలింగంపల్లి, చందా నగర్, కూకట్ పల్లి, మూసాపేట్, కూకట్ పల్లి, కుత్బుల్లాపూర్, అల్వాల్ లలో ఏర్పాటు చేయనున్నారు.

 సికింద్రాబాద్ జోన్:  సికింద్రాబాద్ జోన్ లో  ముషీరాబాద్, అంబర్ పేట్, మల్కాజిగిరి, సికింద్రాబాద్,  బేగం పేట్ సర్కిళ్లలో అన్నపూర్ణ కేంద్రాలలో సీట్టింగ్ వసతి కల్పించేందుకు జిహెచ్ఎంసి చర్యలు చేపట్టింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here