8న రాయదుర్గంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ పర్యటన

0
106
Spread the love

8న రాయదుర్గంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ పర్యటన

అనంతపురం జూలై 7 (ఎక్స్ ప్రెస్ న్యూస్ );: రాయదుర్గంలో రేపు(గురువారం) ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పర్యటించనున్నారు. రాయదుర్గంలో జరిగే రైతు సభకు హాజరుకానున్నారు. ఉడేగోళం గ్రామంలో రైతు భరోసా కేంద్రాన్ని సీఎం ప్రారంభించనున్నారు. రాయదుర్గం మార్కెట్‌ యార్డ్‌లో అగ్రి ల్యాబ్‌ను సీఎం ప్రారంభించనున్నారు. రూ.1506 కోట్ల అగ్రి ప్రాజెక్టులను సీఎం ప్రారంభించనున్నారు.రూ.413 కోట్లతో నిర్మించిన 1,898 ఆర్‌బీకేలు.. రూ.80 కోట్లతో నిర్మించిన 100 అగ్రికల్చర్‌, ఆక్వా ల్యాబ్‌లు.. రూ.31.74 కోట్లతో నిర్మించిన 53 వెటర్నరీ ఆస్పత్రులను సీఎం ప్రారంభించనున్నారు. రూ.400 కోట్లతో నిర్మించనున్న 1262 వ్యవసాయ గోదాంలకు సీఎం శంకుస్థాపన చేయనున్నారు. రూ.200 కోట్లతో పోస్ట్‌ హార్వెస్టింగ్‌ పనులను సీఎం ప్రారంభించనున్నారు. రూ.212 కోట్లతో మార్కెట్‌ యార్డుల్లో నాడు-నేడు పనులకు సీఎం జగన్‌ శ్రీకారం చుట్టనున్నారు. రూ.96.64 కోట్లతో రైతుల కోసం ఏర్పాటు చేసిన 611 వాహనాలను సీఎం ప్రారంభించనున్నారు. ఏపీలో 45 కొత్త రైతుబజార్లకు  సీఎం వైఎస్‌ జగన్‌ శంకుస్థాపన చేయనున్నారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here