దురుద్దేశం తో కూడుకున్న విశాఖ భూముల వేలం
భూములను అమ్మి ప్రభుత్వం ఏ సాధించబోతోంది?
`విశాఖపట్నం, ఏప్రిల్ 19(ఎక్స్ ప్రెస్ న్యూస్ ); ఒకవైపు పరిపాలనా రాజధాని విశాఖ అంటూనే, ఇక్కడున్న అత్యంత విలువైన భూములను వేలం ద్వారా అమ్మకానికి వేలం వేలం వేయలనుకోవడం దురుద్దేశం తో కూడుకున్నదని యునైటెడ్ బహుజన పోరాటసమితి (యుబిఎస్పి) జాతీయ కన్వినర్ కరణం తిరుపతి నాయుడు పేర్కొన్నారు. ‘మిషన్ బిల్డ్ ఏపీ’లో భాగంగా విశాఖలో ఖరీదైన స్థలాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమ్మకానికి పెట్టిందని ఈ అమ్మకం వేలం ద్వారా జరుగుతుందని, రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఈ ప్రక్రియకు నేషనల్ బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్ కార్పొరేషన్ (ఎన్బీసీసీ) 18 స్థలాలకు వేలం ప్రకటన విడుదల చేసిందని పేర్కొన్నారు. బీచ్ రోడ్డులో ఏపీఐఐసీకి చెందిన 13.59 ఎకరాల అత్యంత విలువైన భూమికి ఎన్బీసీసీ రూ. 1452 కోట్లను ఆఫ్సెట్ ప్రైస్ (రిజర్వ్ ధర)గా నిర్ణయించింది. ఈ భూమినే గత టీడీపీ ప్రభుత్వ హయంలో దుబాయ్‌కి చెందిన ‘లులూ’ గ్రూప్‌కి కన్వెన్షన్ సెంటర్, షాపింగ్ మాల్, సినిమా థియేటర్లు కట్టేందుకు లీజుకు ఇచ్చారని,వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే వీటిని రద్దు చేసింది. బీచ్ రోడ్డులోని స్థలంతో పాటు విశాఖపట్నంలోని అగనంపూడి, ఫకీర్ టకీయా ప్రాంతాలలోని మరో 17 ఆస్తులు కూడా ప్రభుత్వం వేలానికి పెట్టిన వాటిలో ఉన్నాయి. అయితే ఇవన్నీ ఎకరం, అర ఎకరం కంటే తక్కువ విస్తీర్ణం ఉన్న భూములే. ఈ మొత్తం భూముల వేలానికి సంబంధించిన పూర్తి వివరాలను ఎన్బీసీసీ వెబ్సైట్లో ఉంచారు. ఏపీలో ఉన్న ప్రభుత్వ భూములను గుర్తించడం, ఆక్రమణలు, వివాదాల్లో ఉన్న భూముల వివరాలను సేకరించడం, వాటిలో ప్రభుత్వ అవసరాల మేర భవన సముదాయాలు నిర్మించడం, అలాగే ప్రభుత్వ భూములను వేలం ద్వారా అమ్మి తద్వారా ప్రభుత్వ ఖజానాకు ఆదాయం సమకుర్చుకోవడం ‘మిషన్ బిల్డ్ ఏపీ’ కార్యక్రమ లక్ష్యాలు. ఇందులో భాగంగానే ప్రభుత్వం ఎన్బీసీసీ సంస్థకు భూముల అమ్మకం, వేలం పనులను అప్పగించింది. అయితే, ఈ పథకం పేరుతో ప్రభుత్వ భూములను ఇష్టారాజ్యంగా అమ్మేస్తున్నారని ఆయన విమర్శించారు. . ‘‘విశాఖలో భూములను అమ్మాల్సిన అవసరం ఏముంది? ముఖ్యమంత్రి చేతకానితనం వల్ల రాష్ట్ర ఆర్థిక పరిస్థితి నాశనమైంది. ఏదో ఒకటి అమ్ముకుంటే గానీ, రోజు గడవని పరిస్థితికి తీసుకొచ్చారు’’ అన్న విమర్శిలు వినవస్తున్నాయన్నారు. విశాఖలో భూముల వేలాన్ని దాదాపు అన్ని విపక్ష పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి. సంక్షేమ పథకాలు కొనసాగాలంటే కొన్ని నిర్ణయాలు తీసుకోక తప్పదని అధికార పార్టీ అంటుంటే, రాష్ట్రాన్ని దివాలా తీయించి, భూములు అమ్మి ఖజానా నింపుకునేందుకు సర్కారు ప్రయత్నిస్తోందని తిరుపతి నాయుడు ఆరోపించారు. ఒక వైపు పరిపాలన రాజధాని అంటూనే ఖరీదైన భూముల్ని అమ్మేస్తే రేపు రాజధాని అవసరాలకి భూమి ఎక్కడ నుంచి తెస్తారని ప్రశ్నించారు. ‘‘గతంలో టీడీపీ ప్రభుత్వం ‘లులూ’ గ్రూప్‌కి భూములు ఇచ్చింది. రూ.2 వేల కోట్ల పెట్టుబడితో అంతర్జాతీయ స్థాయిలో కన్వెన్షన్ సెంటర్, షాపింగ్ మాల్, ఫైవ్‌స్టార్ హోటల్ వంటి ప్రాజెక్టులను పెడతామని చెప్పారు. దాదాపు 5వేల మందికి ఉపాధి కల్పిస్తామని అన్నారు. జగన్ ప్రభుత్వం ఆ లీజును రద్దు చేసింది. కానీ ఇప్పుడు అవే భూముల్ని అమ్మకానికి పెట్టడంలో ప్రభుత్వ అంతర్యం అర్థం కావడం లేదని పేర్కొంటున్నారు.‘‘విశాఖ నగరంలో ప్రతి గజం ఎంతో విలువైనది. నగర పరిధిలో ఉన్న భూములను జీవీఎంసీకి బదలాయిస్తే మంచిదని, కస్టోడియన్‌గా జీవీఎంసీనే కొనసాగించాలని, అప్పుడే భూములను కాపాడుకోగలుతామని తిరుపతి నాయుడు పేర్కొన్నారు.