రాష్ట్ర ఎన్నికల కమిషన్ నీలం సాహ్నికి ఏపీ హైకోర్టు నోటీసులు

0
90
Spread the love

రాష్ట్ర ఎన్నికల కమిషన్ నీలం సాహ్నికి ఏపీ హైకోర్టు నోటీసులు

అమరావతి జూన్ 15 (ఎక్స్ ప్రెస్ న్యూస్ ): రాష్ట్ర ఎన్నికల కమిషన్ నీలం సాహ్నికి ఏపీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఎస్ఈసీగా నీలం సాహ్ని నియామకాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్‍పై ధర్మాసనం మంగళవారం విచారణ చేపట్టింది. ఏపీ ప్రభుత్వంతో పాటు, ఇతర ప్రతివాదులు కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను ఈనెల 29కి వాయిదా వేసింది. కాగా మార్చి 31న నిమ్మగడ్డ రమేశ్ కుమార్ పదవీ కాలం ముగియడంతో ఆయన స్థానంలో నీలం సాహ్ని నియామకమయ్యారు. నీలం సాహ్మి ఎస్ఈసీగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఏప్రిల్ 8న జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు జరిగాయి. అయితే ఆ ఎన్నికలను హైకోర్టు రద్దు చేసింది. కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలని సూచించింది. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here