వరుణుడికి ఉన్న కరుణ కేంద్రానికి లేకపోవటం దురదృష్టకరం : కాలవ శ్రీనివాసులు

0
439
Spread the love

వరుణుడికి ఉన్న కరుణ కేంద్రానికి లేకపోవటం దురదృష్టకరం : కాలవ శ్రీనివాసులు

నవ్యాంధ్రప్రదేశ్‌లో ఒక్క ఎకరా కూడా ఎండిపోనివ్వకుండా చేస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీని నిలబెట్టుకునేందుకు తన వయస్సును కూడా లెక్కచేయకుండా రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆయన కృషికి ప్రకృతి కూడా తోడయ్యింది. నేను సైతం అన్నట్లుగా వరుణుడు విస్తారంగా వర్షాలు కురవటం ద్వారా రైతులకు అండగా నిలిచి రాష్ట్రాభివృద్ధిలో భాగస్వాములయ్యారు. రాష్ట్రం కష్టాల్లో ఉందని గ్రహించి రైతులు, ప్రజలు ఎటువంటి ఇబ్బందులకు గురి కాకుండా సకాలంలో వర్షాలు కురిపిస్తున్న వరుణుడికి ఉన్న కరుణ కేంద్రానికి లేకపోవడం దురదృష్టకరం. పోలవరం ప్రాజెక్టుకు నిధులు కేటాయించడం కొర్రీలు పెట్టడం ఎంత వరకు సమంజసం? దేశంలో ఎక్కడా లేని విధంగా నదుల అనుసంధానం చేసి చరిత్ర సృష్టించింది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అవ్వడం ఎంతో గర్వకారణం. ఒక విజన్‌ ఉన్న నాయకుడు నవ్యాంధ్రప్రదేశ్‌కు దొరకటం వరమని ప్రజలందరూ భావిస్తున్నారు. ఇటువంటి ముఖ్యమంత్రి మాకు కూడా కావాలని ఇతర రాష్ట్రాల ప్రజలు కోరుకుంటున్నారు. అని రూరల్‌ హౌసింగ్‌ మరియు సమాచార శాఖా మంత్రి వర్యులు కాలవ శ్రీనివాసులు పేర్కొన్నారు.

శ్రీశైలం జలాశయం నాలుగు గేట్ల ద్వారా లక్షా 4వేల క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. ప్రస్తుతం శ్రీశైలం జలాశయం ఇన్‌ఫ్లో 3,62,098 క్యూసెక్కులు ఉండగా.. ఔట్‌ఫ్లో 1,03,857 క్యూసెక్కులుగా ఉంది. కృష్ణమ్మ పరవళ్లు తొక్కడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కరువును రాష్ట్రం నుంచి తరిమేయాలన్న ఆలోచనకు ఆధ్యం పోస్తుంది. దీంతో రాయలసీమలో రత్నాలు పండించే అవకాశం రైతులకు లభించినట్లే అవుతుంది. రాయలసీమకు మునుపెన్నడూ లేని విధంగా దాదాపు 150 టీఎంసీల నీరు ఇవ్వటం జరిగింది. అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్‌గా ఉన్న పేరు మళ్లీ సార్ధకం కానుంది. లోటు బడ్జెట్‌ను సైతం లెక్కచేయకుండా 2014 నుంచి ఇప్పటి వరకు దాదాపు 50,124 కోట్లు కేవలం జలవనరులకే వ్యయం చేయడం ప్రభుత్వ ప్రాధాన్యతకు అద్దం పడుతుంది. వ్యవసాయ రంగంలో ఇప్పటికే 26.5% గ్రోత్‌తో కేంద్రం కంటే ముందున్నాం. పట్టిసీమ ద్వారా డెల్టా ప్రాంతంలో దిగుబడిని పెంచగలిగాం. పోలవరం ఇప్పటికే ఒక రికార్డు సమయంలో 57.14 శాతం పనులను పూర్తి చేసుకున్నాం. అదే విధంగా రాష్ట్రంలోని 29 ప్రాజెక్టులను ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేస్తున్నాం. అని చెప్పారు మంత్రి శ్రీ‌నివాసులు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here