ఏపి లో టెన్త్‌, ఇంటర్‌ పరీక్షల నిర్వహణపై విద్యాశాఖ కీలక ప్రతిపాదనలు

0
106
Spread the love

 ఏపి లో టెన్త్‌, ఇంటర్‌ పరీక్షల నిర్వహణపై విద్యాశాఖ కీలక ప్రతిపాదనలు

అమరావతి జూన్ 17 (ఎక్స్ ప్రెస్ న్యూస్ );: ఆంధ్రప్రదేశ్‌లో టెన్త్‌, ఇంటర్‌ పరీక్షల నిర్వహణపై విద్యాశాఖ కీలక ప్రతిపాదనలు చేసింది. కరోనా అదుపులోకి వస్తుండటంతో పరీక్షల నిర్వహణకు నిర్ణయం తీసుకుంది. నేడు సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముందుకు ప్రతిపాదనలు తీసుకెళ్లనుంది.రాష్ట్ర వ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు రాసేందుకు 6.28 లక్షల మంది విద్యార్థులు రిజిస్టర్ అయ్యారు. గత సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది 3 వేల మంది విద్యార్థులు తగ్గారు. పరీక్షల నిర్వహణకు 4072 సెంటర్లు ఏర్పాటు చేస్తున్నారు. కరోనా నేపథ్యంలో గతేడాది 11 పరీక్షా పేపర్లను 6 పేపర్లకు కుదించిన ప్రభుత్వం ఈ సారి 7 పేపర్లలో పరీక్షలు నిర్వహించనుంది. సైన్స్ సబ్జెక్టును.. ఫిజికల్ సైన్స్ బయలాజికల్ సైన్స్ పేపర్లుగా విభజించి ఒక్కో పేపర్ను 50 మార్కులకు నిర్వహించనున్నారు.  కాగా జూలై 7 నుంచి 25 వరకు ఇంటర్ పరీక్షల నిర్వహణకు ఇంటర్ బోర్డు కూడా పలు ప్రతిపాదనలు సూచించింది. ఇవాళ విద్యాశాఖపై సీఎం వైఎస్ జగన్ సమీక్ష నిర్వహిస్తుండటంతో.. ఆయన పరీక్షల నిర్వహణపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్న దానిపై అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది.ఈ ఏడాది ఫస్టియర్ సెకండియర్ పరీక్షలు ఒకే షెడ్యూల్లో నిర్వహిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 10 లక్షల మందికి పైగా విద్యార్థులు ఇంటర్ పరీక్షలకు హాజరు కానున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here