ఆర్మీ రిక్రూట్‌మెంట్ సెలక్షన్స్ ….. అభ్యర్థుల వీరంగం

0
137
Spread the love

ఆర్మీ రిక్రూట్‌మెంట్ సెలక్షన్స్ ….. అభ్యర్థుల వీరంగం

హైదరాబాద్: నగరంలోని లంగర్ హౌస్‌లో ఆర్మీ రిక్రూట్‌మెంట్ సెలక్షన్స్ కోసం వచ్చిన అభ్యర్థులు వీరంగం వేశారు. సరైన వసతులు కల్పించలేదంటూ రోడ్డుపైకి వచ్చి హంగామా చేశారు. వాహనాలను అడ్డుకుని బీభత్సం సృష్టించారు. ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీ కోసం తెలుగు రాష్ట్రాల నుంచి అభ్యర్థులు లంగర్‌హౌస్‌కు భారీగా తరలి వచ్చారు. అయితే అధికారులు సరైన వసతులు కల్పించలేదంటూ రభస చేశారు. నడిరోడ్డుపైకి వచ్చి వీరంగం వేశారు. వాహనాలను అడ్డుకున్నారు. ఓ వ్యాన్‌ను అడ్డుకుని అందులోని పాల ప్యాకెట్లు లాక్కుని రోడ్డుపై పారబోసారు. షైన్ బోర్డులను పీకేశారు. యువకులు చేసిన బీభత్సంతో వహనదారులు, ప్రయాణీకులు భయాందోళనకు గురయ్యారు. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటనపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here