ప్ర‌మాణ స్వీకారం చేసిన ఆర్యవైశ్య సంఘం కొత్త క‌మిటీ

0
167
Spread the love

గ్రీన్‌హిల్స్‌ కాలనీ ఆర్యవైశ్య సంఘం 2022 2024 నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘ‌నంగా జ‌రిగింది. వాసవీ కాలనీ, ఆధ్యాత్మిక కేంద్రంలో జరిగింది ఈ కార్యక్రమానికీ ముఖ్యఅతిథిగా వాసవీ కాలనీ సంక్షేమసంఘం అధ్య‌క్షుడు గౌరిశెట్టి చంగశేఖర్ గుప్త మరియు చైతన్యపురి కార్పొరేటర్ రంగ నర్సింహ గుప్త పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎల్లవేళలా ఆర్యవైశ్యుల అభివృద్దికి పాటుపడ‌తామని తెలిపారు. వీరి స‌మ‌క్షంలో నూతన కార్యవర్గ ప్ర‌మాణ స్వీకార కార్య‌క్ర‌మం జరిగింది. మ‌లే శ్రీమన్నారాయణ అధ్యక్షునిగా ఎంపిక‌య్యారు. ప్రదానకార్యదర్శిగా బెరెల్లి రవీందర్ గుప్త ప్ర‌మాణం చేశారు.కోశాధికారిగా ఆర్వేటి వేణుమాదవ్ ఎన్నిక‌య్యారు. మహిళావిభాగం అధ్య‌క్షురాలిగా పిసర్ల లక్ష్మీ సుబ్రహ్మణ్యం,గౌరవ అద్యక్షునిగా వూర శ్రవణ్‌కుమార్,అర్గనైజింగ్ సెక్రటరీగా గుండా చంద్రశేఖరగుప్తా, మరియు ఉపాద్యక్షులుగా టీవీ మధుసూధన్, విసనకర్రాల శ్రీనివాసులు ఉప కార్యదర్శులుగా శేషాంజనేయులు తో పాటు మిగత కార్యవర్గo ప్రమాణస్వికారం చేసింది. ఈ కార్యక్రమం లో వివిధ కాలనీల ఆర్యవైశ్య సంఘం ప్రముఖులు సంఘ మాజీ అధ్య‌క్షుడు చిగుళ్లపల్లి లోకేశ్‌, పొద్దుటూరి శ్రీనివాస్, కొత్తూరు శ్రీనివాస్ , మధన్మోహన్ గుప్త, బిజ్జల విజయకుమార్, గౌరిశెట్టి అరుంకుమార్, చిగుళ్లపల్లి హరినాథ్, చింతల బాలరాజు త‌దిత‌రులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here