100 కోట్ల వ్యాక్సినేషన్ ప్రక్రియలో ఆశా వర్కర్ ల పాత్ర మరువలేనిది

0
70
Spread the love

100 కోట్ల వ్యాక్సినేషన్ ప్రక్రియలో ఆశా వర్కర్ ల పాత్ర మరువలేనిది: ఎన్ఐ-ఎమ్ఎస్ఎమ్ఇ డైరెక్టర్ జనరల్, శ్రీమతి గ్లోరీ స్వరూప

హైదరాబాద్, అక్టోబర్ 22, 2021 – అపోహలను పోగొట్టి వ్యాక్సినేషన్ ప్రక్రియను విజయవంతం చేయడంలో ఆశా వర్కర్ ల పాత్ర మరువలేనిదని ఎన్ఐఎమ్ఎస్ఇ డైరెక్టర్ జనరల్ శ్రీమతి గ్లోరీ స్వరూప అన్నారు.

చిన్న మరియు మధ్య తరహా జాతీయ సంస్థ (ఎన్ఐ-ఎమ్ఎస్ఎమ్ఇ) గురువారం ఆశా వర్కర్ ల కోసం నిర్వహించిన శిక్షణా కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, దేశంలో కరోనా విలయ తాండవం చేస్తున్న సమయంలో ప్రాణాలను లెక్క చేయకుండా, ప్రజల ప్రాణాలను కాపాడడానికి వారు చేసిన సేవలను శ్రీమతి గ్లోరీ స్వరూప కొనియాడారు. వారి కర్తవ్య దీక్ష వల్లే భారతదేశం 100 కోట్ల టీకా డోసులను పూర్తి చేయగలిగిందని ఆమె అన్నారు.

కార్యక్రమంలో వివిధ జిల్లాల నుండి సుమారు 100 మంది ఆశా వర్కర్ లు, ఎన్ఐఎమ్ఎస్ఎమ్ఇ అధికారులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here