మాజీ ప్ర‌ధాని అట‌ల్ జీ అంత్య‌క్రియలు అత్యున్న‌త ప్ర‌భుత్వ లాంఛ‌నాల‌తో పూర్తి

0
567
Spread the love

మాజీ ప్ర‌ధాని అట‌ల్ జీ అంత్య‌క్రియలు అత్యున్న‌త ప్ర‌భుత్వ లాంఛ‌నాల‌తో పూర్తి

న్యూఢిల్లీ: ఇక సెలవంటూ యమునా నది తీరంలోని స్మృతి స్థల్‌లో సేద తీరారు మ‌న దేశ మాజీ ప్ర‌ధాని… భార‌త‌ర‌త్న అట‌ల్ బిహారీ వాజ్‌పాయ్‌. అశేష జనవాహిని, ప్రియాతి ప్రియమైన బీజేపీ నేతలు, అభిమాన శ్రేణుల తుది నివాళుల మధ్య అటల్‌జీ అంతిమసంస్కారాలు ముగిశాయి. అందరి కన్నీటి వీడ్కోలు మధ్య పూర్తి ప్రభుత్వ అధికార లాంఛనాలతో, హిందూ సంప్రదాయం ప్రకారం మంత్రోచ్ఛారణల మధ్య కర్మయోగి అంత్యక్రియలు ముగిశాయి. వాజ్‌పేయి దత్తపుత్రిక నమిత భట్టాచార్య ఆయన చితికి నిప్పంటించి అంతిమ సంస్కారాలను నిర్వహించారు. అనంతరం త్రివిధ దళాల అధిపతులు గౌరవ వందనం సమర్పించారు. ఈ సందర్భంగా స్మృతిస్థల్‌ ప్రాంగణమంతా అటల్‌జీ అమర్‌ రహే నినాదాలు మిన్నంటాయి.

 

త్రివిధ దళాలు గౌరవ వందనం సమర్పించాయి. వాజ్‌పేయి భౌతికకాయానికి ప్రధాని మోదీ కడసారి నివాళులర్పించారు. వాజ్‌పేయి అంతిమ సంస్కారాలకు రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ఎల్‌కే అద్వానీ, అమిత్ షా, బీజేపీ నాయకులు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. భూటాన్ రాజు, నేపాల్, శ్రీలంక, బంగ్లాదేశ్ విదేశాంగ మంత్రులు, అఫ్ఘనిస్థాన్ మాజీ ప్రెసిడెంట్ కర్జాయ్, పాకిస్థాన్ న్యాయశాఖ మంత్రి వాజ్‌పేయి అంత్యక్రియలకు హాజరయ్యారు.


నిన్న సాయంత్రం త‌ర‌లిరాని లోకానికి వెళ్లిపోయిన అట‌ల్ జీ పార్థీవ దేశాన్ని ఈ రోజు ఉద‌యం బీజేపీ కేంద్ర కార్యాలయానికి తరలించగా, ఆయనకు ఘనంగా తుది వీడ్కోలు పలికేందుకు వివిధ రంగాల ప్రముఖులు తరలివచ్చారు. దేశానికి ఎనలేని సేవలందించిన మహానేతకు నివాళులు అర్పించారు. ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షా, కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌, యూపీ ముఖ్యమంత్రి యూపీ సీఎం ఆదిత్యానాథ్‌ యోగిలు వాజ్‌పేయికి నివాళులు అర్పించారు. పార్టీలకు అతీతంగా బీజేపీ కేంద్ర కార్యాలయానికి నేతలు, ప్రజలు తరలివచ్చి వాజ్‌పేయికి కన్నీటి వీడ్కోలు పలికారు.

********

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here