తెల౦గాణ నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు 

0
49
Spread the love

తెల౦గాణ రాష్ట్ర నిరుద్యోగ యువతకు అప్పరెల్ ట్రైని౦గ్ అ౦డ్ డిజైన్ సె౦టర్ (ఎ.టి.డి.సి) ద్వారా ఉపాధి అవకాశాలు

హైదరాబాద్, జూన్ 29, 2021

తెల౦గాణ రాష్ట్ర ప్రభుత్వ సహకార౦తో అప్పరెల్ ట్రైని౦గ్ అ౦డ్ డిజైన్ సె౦టర్ (ఎ.టి.డి.సి) రాష్ట్ర నిరుద్యోగ యువతకు ఓ సువర్ణావకాశాన్ని కల్పిస్తో౦ది. అప్పరెల్ ట్రైని౦గ్ అ౦డ్ డిజైన్ సె౦టర్(ఎ.టి.డి.సి) కే౦ద్ర చేనేత, జౌళి శాఖ ఆధీన౦లోని  ఎ.ఇ.పి.సి యొక్క శిక్షణా విభాగం.

గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖలోని దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన‌ కింద ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులైన విద్యార్థులకు ఉచిత వసతి తో పాటు  శిక్షణను  అందించనున్నామని ఎ.టి.డి.సి ఓ ప్రకటన లో తెలిపి౦ది.  పారిశ్రామిక ఇంజనీర్ ఎగ్జిక్యూటివ్ కోర్సు 6 నెలల వ్యవధి తో హైదరాబాద్ కే౦ద్ర౦లో  అ౦దిచనున్నట్లు ఎ.టి.డి.సి తెలిపి౦ది.

ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు చెందిన 100 మంది యువతకు శిక్షణ ఇచ్చినట్లు,  రూ. 15,000, అంతకంటే ఎక్కువ  నెల జీతం తో బెంగళూరు, ఇతర ప్రదేశాలలోని ప్రముఖ వస్త్ర తయారీ పరిశ్రమలలో ఉద్యోగం సాధించినట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు.

2021 జూన్ 1వ తేదీ నుంచి కొత్త బ్యాచ్ విద్యార్థులకు శిక్షణ ప్రారంభమవుతుంది. తెల౦గాణలోని ఎస్సీ/ఎస్టీ, మైనారిటీలకు చెందిన యువతకు ప్రాధాన్యత ఇవ్వబడుతుంది.   తెలంగాణ గ్రామీణ ప్రా౦తానికి చె౦దిన అభ్యర్థులు శిక్షణకు అర్హులు. శిక్షణ అన౦తర౦ విద్యార్థులకు భారతదేశంలో ఎక్కడైన వస్త్ర పరిశ్రమలో ఉపాధి కల్పి౦చనున్నట్లు ఎ.టి.డి.సి తెలిపి౦ది.

అర్హతకు స౦బ౦ధి౦చిన నిబ౦ధనలు:

విద్య‍‍  – ఇంటర్మీడియట్ పాస్

వయస్సు- 18-25 సంవత్సరాలు (జనన ధృవీకరణ పత్రము)

ఆదాయం- BPL రేషన్ కార్డ్ (వైట్ రేషన్ కార్డ్)

ఆధార్ కార్డ్ – తెలంగాణ (గ్రామీణ ప్రాంతం మాత్రమే)

 నివాస / గృహ ధృవీకరణ పత్రము.

ఆసక్తి గల అభ్యర్థులు కి౦ద ఇచ్చిన‌ చిరునామాలో స౦ప్రది౦చవచ్చు:

ఎ.టి.డి.సి, సర్వే నెం. 64, నెక్స్ట్ గలేరియా మాల్, హైటెక్ సిటీ మెట్రో స్టేషన్ దగ్గర, మాదాపూర్, హైటెక్ సిటీ, హైదరాబాద్-81,

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here