కొవిడ్ వ్యాక్సిన్ పై పబ్లిసిటీ వాహనాల ద్వారా అవగాహన

0
556
Spread the love

కొవిడ్ వ్యాక్సిన్ పై కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ ఆద్వర్యంలో పబ్లిసిటీ వాహనాల ద్వారా అవగాహన కార్యక్రమాలు
ప్రారంభించిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి శ్రీ జి. కిషన్ రెడ్డి

హైదరాబాద్ – కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి శ్రీ జి. కిషన్ రెడ్డి శనివారం హైదరాబాద్ కవాడిగూడలోని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల సముదాయం (సిజిఒ టవర్స్) లో, కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖకు చెందిన పత్రికా సమాచార కార్యాలయం (పిఐబి), రీజినల్ అవుట్ రీచ్ బ్యూరో (ఆర్ఒబి) సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొవిడ్ వ్యాక్సిన్ ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని, ప్రచార వాహనాలను జెండా ఊపి ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పత్రికా సమావేశంలో కేంద్ర మంత్రి మాట్లాడుతూ మన ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు ఎంతో వ్యక్తిగత శ్రద్ధ తో దేశ ప్రజలు బాగుండాలనే ఉద్దేశంతో కరోనా వ్యాక్సిన్ విషయంలో నిరంతరం పర్యవేక్షణ చేయడం వల్ల ప్రస్తుతం ఈ స్థాయికి వచ్చామన్నారు. అయితే ఇంతటితో కరోనా ప్రమాదం తొలగిపోలేదు. ప్రతి ఒక్కరికి టీకా అందే వరకు మనమందరం జాగ్రత్తగా ఉంటూ సరైన జాగ్రత్తలు తీసుకుంటూ కరోనా విషయంలో అప్రమత్తంగా ఉండాలన్నారు.

కరోనా వాక్సిన్ పై వస్తున్న వదంతులను, పుకార్లను ప్రజలు నమ్మవద్దని, కరోనా వాక్సిన్ కి సంబంధించిన వాస్తవాలను ప్రజలకు ఎప్పటికప్పుడు అందిస్తూ అపోహలను దూరం చేయవలసిన అవసరం ఉందని, మీడియా మిత్రుల సహకారంతోనే ఇది సాధ్యపడుతుందని మంత్రి అన్నారు.

కరోనా టీకా మొదటి దశలో 3 కోట్ల మంది ఫ్రంట్ లైన్ వర్కర్లకు టీకా అందించినట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు.. సమీక్ష అనంతరం 2వ దశ టీకాలను 30 కోట్ల మందికి అందించనున్నట్లు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జీ కిషన్ రెడ్డి తెలిపారు.

నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆశయాలను ఆలోచనలను ప్రజలకు, ముఖ్యంగా యువతకు అందిచాలని అన్నారు. నేతాజీ జయంతిని కేంద్ర ప్రభుత్వం పరాక్రమ దివాస్ గా ఏడాది పొడవునా నిర్వహించనున్నట్లు కిషన్ రెడ్డి తెలిపారు.

భారత గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని నేతాజి సుభాష్ చంద్రబోస్, మహాత్మా గాంధీ జీవిత విశేషాలతో పాటు కేంద్ర సమాచార ప్రసార శాఖకు సంబంధించిన రీజినల్ ఔట్ రీచ్ బ్యూరో ద్వారా చేస్తున్న వివిధ కార్యక్రమాలకు సంబంధించిన ఫోటో ఎగ్జిబిషన్ ను కూడా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రారంభించారు.

జాతీయ అంటువ్యాధుల నివారణ సంస్థ ను తెలంగాణలో ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సంసిద్దంగా ఉన్నట్లు కేంద్ర మంత్రి తెలిపారు.

తెలంగాణ‌లో ఎంపిక చేసిన 8 జిల్లాలు – హైద‌రాబాద్‌, రంగారెడ్డి, మేడ్చ‌ల్-మ‌ల్కాజ్‌గిరి, సంగారెడ్డి, సిద్దిపేట‌, నిజామాబాద్‌, వరంగ‌ల్ అర్బ‌న్‌, క‌రీంన‌గ‌ర్ లలో ఈ నెల 23 నుంచి 29వ తేదీ వ‌ర‌కు మొబైల్ వ్యాన్ల ద్వారా క‌రోనా వ్యాప్తి నివార‌ణ, క‌రోనా టీకాల‌పై ప్రజలకు అవ‌గాహ‌న కల్పించనున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here