ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో తెలంగాణలో సైకిల్ ర్యాలీ

0
60
Spread the love

ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా ప్రపంచ సైకిల్ దినోత్సవం సందర్భంగా తెలంగాణలో సైకిల్ ర్యాలీని నిర్వహించనున్న ఎన్.వై.కె.ఎస్

TOOFAN – 2 జూన్ , 2022 – ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకలో భాగంగా, యువజన వ్యవహారాలు & క్రీడల మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం 3 జూన్ 2022న దేశం అంతటా ప్రపంచ సైకిల్ దినోత్సవాన్ని జరుపుకోవాలని నిర్ణయించింది.

ఈరోజు హైదరాబాద్‌లోని పత్రికా సమాచార కార్యాలయం లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఎన్.వై.కె.ఎస్ (NYKS) రాష్ట్ర డైరెక్టర్ శ్రీమతి.విజయరావు మాట్లాడుతూ ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకల్లో భాగంగా ప్రపంచ సైకిల్ దినోత్సవాన్ని పురస్కరించుకుని నెహ్రూ యువ కేంద్ర సంఘథన్ తెలంగాణ రాష్ట్రంలో సైకిల్ ర్యాలీలు నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. NYKS తెలంగాణ రాష్ట్రం లోని ములుగు జిల్లాలోని రామప్ప దేవాలయం, గచ్చిబౌలి స్టేడియం రంగారెడ్డి జిల్లా, హైదరాబాద్‌లోని సంజీవయ్య పార్క్‌ లో మూడు చోట్ల సైకిల్ ర్యాలీలు నిర్వహిస్తున్నట్లు ఆమె తెలిపారు.

ఎన్.వై.కె.ఎస్ (NYKS) డైరెక్టర్ కార్యక్రమం గురించి వివరాలను పంచుకుంటూ, రేపు ఉదయం 6.30 గంటలకు సంజీవయ్య పార్క్ నుండి సైకిల్ ర్యాలీ ఫ్లాగ్‌ఆఫ్ చేయడానికి గౌరవనీయులైన తెలంగాణ క్రీడలు మరియు యువజన శాఖల మంత్రి శ్రీ. వి.శ్రీనివాస్ గౌడ్ ముఖ్య అతిథిగా పాల్గొంటారని తెలిపారు.శ్రీ సంతోష్ IAS, (HGCL) హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్) మరియు యువజన సర్వీసుల డైరెక్టర్ శ్రీ వాసం వెంకటేశ్వర్లు IAS కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారని తెలిపారు.
రేపు హైదరాబాద్‌లోని ఓఆర్‌ఆర్ చెక్‌పోస్టు వద్ద ముగిసే సైకిల్ ర్యాలీని గచ్చిబౌలి స్టేడియంలో జెండా ఊపి ప్రారంభించేందుకు శేర్లింగంపల్లి ఎమ్మెల్యే శ్రీ ఎ. గాంధీ ముఖ్య అతిథిగా హాజరవుతారని ఆమె తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా అడిషనల్ కలెక్టర్ శ్రీ ప్రతీక్ జైన్, I.A.S., తెలంగాణ విశ్వవిద్యాలయం గౌరవనీయ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ డి.రవీందర్ కూడా గౌరవ అతిథిగా పాల్గొంటారని ఆమె తెలిపారు. ఈ సైకిల్ ర్యాలీలన్నింటిలో విద్యార్థులు, వివిధ యువజన సంఘాల సభ్యులు, జాతీయ సేవా పథకం, నెహ్రూ యువకేంద్ర సంగతన్ వాలంటీర్లు పాల్గొననున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here