ఆన్‌లైన్ ఆటలతో ‘ఆజాదీ’పై అవ‌గ‌హ‌న

0
129
Spread the love

ఆన్‌లైన్ ఆటలతో ‘ఆజాదీ’పై అవ‌గ‌హ‌న

– స్వాతంత్ర్య పోరాటంపై అత్య‌ధికుల‌కు అవ‌గ‌హ‌న క‌ల్పించేలా ‘ఆజాదీ క్వెస్ట్’

– వినూత్నఅన్‌లైన్ యాప్‌తో ముందుకు వ‌చ్చిన కేంద్ర స‌మాచార ప్ర‌సార‌ శాఖ‌


హైద‌రాబాద్ : ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌’ శుభ సమ‌యంలో భారత స్వాతంత్ర్య సంగ్రామ ఘట్టాలను, ఆ సంగ్రామంలో పాల్గొని అంతగా గుర్తింపున‌కు నోచుకోని ప‌లువురు సమరయోధుల కథలను వెలుగులోకి తెచ్చి ప్ర‌జ‌ల‌లో జాతీయ‌భావాన్ని పెంపొందించేందుకు కేంద్ర ప్ర‌భుత్వం వినూత్న ఆలోచ‌న‌తో ముందుకు వ‌చ్చింది. దేశంలో ఆన్‌లైన్ క్రీడలకు ఉన్న డిమాండ్‌, అవకాశాల‌ను ప‌రిగ‌ణలోకి తీసుకున్న ప్ర‌భుత్వం ప్రజలకు ముఖ్యంగా జ‌నాభాలో అత్య‌ధికంగా ఉన్నయువ‌త‌కు ప్రీతిపాత్రంగా ఉంటున్న ఆన్‌లైన్ ఆటల ద్వారా భారత స్వాతంత్ర్య పోరాటం అవగాహన కల్పించాలని నిర్ణ‌యించింది. ఇందులో భాగంగా స్వాతంత్ర్య పోరాటానికి సంబంధించిన అంశాలను. విజ్ఞానాన్ని ఆకర్షణీయంగా రూపొందించి సమగ్ర వివరాలతో ‘ఆజాదీ క్వెస్ట్’ అనే ఆన్‌లైన్ విద్యా మొబైల్ గేమ్ యాప్‌ను రూపొందించింది. దీనిని ఇటీవ‌ల‌ కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి శ్రీ అనురాగ్ సింగ్ ఠాకూర్ ఆవిష్క‌రించారు. జింగా ఇండియా సహకారంతో ఆన్‌లైన్ విద్యా మొబైల్ గేమ్‌ల శ్రేణిని అభివృద్ధి చేశారు. ఈ యాప్ సెప్టెంబ‌రు నుంచి ప్ర‌పంచ వ్యాప్తంగా అందుబాటులోకి వ‌చ్చింది. బొమ్మలు, ఆట పాట‌లతో ప్రజలకు త‌గిన కాలక్షేపం, వినోదంతో పాటు గానే జాతీయ‌త‌పై అవగాహన కల్పించేలా చూడాలన్న ప్రధాన మంత్రి న‌రేంద్ర మోడీ సూచన స్ఫూర్తిగా దీనిని రూపొందించారు.


అత్య‌ధిక జ‌నాభాకు అవ‌గాహ‌న క‌ల్పించేలా..
తాజా నివేదిక‌ల ప్ర‌కారం 13 నుంచి 35 ఏండ్ల వ‌య‌స్సు క‌లిగిన వారు మొత్తం దేశ జ‌నాభాలో దాదాపు 40 శాతంగా ఉన్నారు. ఈ శ్రేణిలోని వారు రానున్న రోజుల్లో భావి భార‌త నిర్మాణంలో కీల‌క శ్రామికులు కానున్నారు. ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌’ శుభ సమ‌యంలో ఈ శ్రేణిలో ఉన్న వారికి భారత స్వాతంత్ర్య సంగ్రామ ఘట్టాలను తెలియ‌ప‌రిచి వారిలో జాతీయ భావాన్ని మ‌రింత‌గా పెంపొందించ‌డం ఎంతో అవ‌స‌రం.. చాలా కీల‌కం కూడా. ఈ విష‌యాన్ని గ‌మ‌నించిన కేంద్ర ప్ర‌భుత్వం ‘ఆజాదీ క్వెస్ట్’ అనే ఆన్‌లైన్ విద్యా మొబైల్ గేమ్ యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. ‘గేమిఫికేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్’ అనే ఇతివృతం ఆధారంగా రూపొందిన గేమ్ సిరీస్ దేశంలో విద్యా రంగంలో విప్లవాత్మక మార్పు తీసుకొస్తుంది. గేమింగ్ రంగం 2021లోనే 28% వృద్ధిని సాధించింది. ఆన్‌లైన్ లో ఆటలు ఆడుతున్న వారి సంఖ్య 2020తో పోల్చి చూస్తే 2021లో 8 శాతం వరకు పెరిగింది. 2023 నాటికి ఆన్‌లైన్ లో ఆటలు ఆడుతున్న వారి సంఖ్య 45 కోట్లకు చేరుతుందని అంచ‌నా. ఈ అంచ‌నాల నేప‌థ్యంలోనే ‘ఆజాదీ క్వెస్ట్’ అనే ఆన్‌లైన్ విద్యా మొబైల్ గేమ్ ప్ర‌భుత్వం అందుబాటులోకి తెచ్చింది. ఈ యాప్ ఆండ్రాయిడ్,ఐఓఎస్ పరికరాలలో అందుబాటులో ఉండేలా రూపొందించారు. ఆంగ్లం మరియు హిందీలో భారతదేశంలోని ప్రజలకు అందుబాటులో ఉండేలా దీనిని త‌యారు చేశారు. ఆజాదీ క్వెస్ట్‌ను పూర్తి చేసిన వారికి సర్టిఫికేట్‌తో సహా ప్రతి నెలా గేమ్‌లు ఆటగాళ్లకు ఉత్తేజకరమైన రివార్డులందిస్తున్నారు.


ఆస‌క్తిక‌ర‌ ప‌జిల్స్‌: ‘ఆజాదీ క్వెస్ట్’ తొలిద‌శ‌లో రెండు భాగాల‌లో అందుబాటులోకి తెచ్చారు. భారత స్వాతంత్ర్య పోరాటంలో భాగంగా 1857 నుండి 1947 వరకు జ‌రిగిన కీల‌క ఘ‌ట్టాలు, ఆయా పోరాటాల‌ వివరాలు ఆటగాళ్లకు సులభంగా అర్థమయ్యేలా ఆలోచింప‌జేసేలా సాధారణ గేమ్ గా మ్యాచ్ 3 పజిల్‌ను ఇందులో అందించారు. 495 స్థాయిలలో గేమ్ ఉంటుంది. ఆటల‌లో పురోగమిస్తున్న ఆటగాళ్ళు 75 ట్రివియా కార్డ్‌లు సేకరించగలరు. ఒకో కార్డు చరిత్రలో కీలక ఘట్టం కలిగి ఉంటుంది. లీడర్‌బోర్డ్‌లలో పోటీపడి, ఆటలో పొందిన రివార్డ్‌లు, ప్రగతిని మరియు సోషల్ మీడియాలో పంచుకోవచ్చు.
విజ్ఞానాన్ని పెంపొందించేలా క్విజ్: ‘హీరోస్ ఆఫ్ భారత్‌’ అనేది ఈయ‌ప్‌లో రెండో విభాగం. 75 స్థాయిలలో 750 ప్రశ్నల ద్వారా భారతదేశ స్వాతంత్ర్య వీరుల గురించి ఆటగాళ్ల జ్ఞానాన్ని పరీక్షించడానికి ఈ క్విజ్ గేమ్‌ రూపొందించబడింది. ఈ క్విజ్ విభాగంలో స్వాతంత్ర్య పోరాటంలో కీల‌కంగా నిలిచి అంతగా వెలుగులోకి రాని హీరోల గురించి తెలియజేసేలా ప్ర‌శ్న‌లు ఉన్నాయి. స్వాతంత్ర్య సంగ్రామంలో పాల్గొని అంతగా గుర్తింపుకు నోచుకోని సమరయోధులకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని వివిధ ప్రభుత్వ శాఖలు సేకరించి ఈ యాప్‌లో పొందుప‌రిచారు. ఈ క్విజ్‌లో మేటి స్కోర్‌ను న‌మోదు చేసిన వారికి వీర్ కార్డులు ల‌భిస్తాయి. ఈ వీర్ కార్డ్‌ల్ని సోషల్ మీడియా పై పంచుకొనేలా ఈ వేదిక‌పై వీలు క‌ల్పించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here