సీఆర్పీఎఫ్ సైకిల్ ర్యాలీతో దేశభక్తి భావం – ఎంపీ తేజస్వి సూర్య

0
190
Spread the love

యువతలో దేశభక్తి జాతీయతా భావం పెంపొందించడానికి

ఆజాదీ కా అమృతోత్సవ్
సీఆర్పీఎఫ్ సైకిల్ ర్యాలీతో దేశభక్తి భావం – ఎంపీ తేజస్వి సూర్య

హైదరాబాద్, సెప్టెంబర్ 08, 2021 – ఆజాదీ కా అమృతోత్సవ్ సందర్భంగా ప్రజలను జాగృతం చేసే ఉద్దేశంతో కేంద్ర రిజర్వ్ పోలీసు దళం కన్యాకుమారి నుంచి ఢిల్లీ రాజ్ కోట్ దాకా తలపెట్టిన సైకిల్ ర్యాలీ ఇవాళ రంగారెడ్డి జిల్లాకి చేరుకుంది. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ లోని ఆచార్య జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం మెయిన్ గేట్ వద్ద బెంగుళూరు పార్లమెంట్ సభ్యుడు తేజస్వి సూర్య, సిఆర్పిఎఫ్ ఉన్నతాధికారులు జెండా ఊపి వారిని స్వాగతించారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున సిఆర్పిఎఫ్ అధికారులు,రాష్ట్ర పోలీసు అధికారులు స్వాగత కార్యక్రమంలో పాల్గొన్నారు. పార్లమెంట్ సభ్యుడు,తేజస్వి సూర్య, సీ ఆర్ పీ ఎఫ్ ఉన్నతాధికారులు , సైకిల్ ర్యాలీతో చాంద్రాయణ గుట్టలోని సీ ఆర్ పీ ఎఫ్ హెడ్ క్వార్టర్స్ కు చేరుకున్నారు. వారికి ఇక్కడ అధికారులు పలు సాంస్కృతిక కార్యక్రమాలతో స్వాగతం పలికారు.

సైకిల్ ర్యాలీలో పాల్గొన్న సిఆర్పిఎఫ్ అధికారులు సిబ్బందిని ఎంపీ తేజస్వి సూర్య జ్ఞాపికలతో సత్కరించారు. యువతలో దేశభక్తి, జాతీయతా భావం పెంపొందించడానికి ఈ సైకిల్ ర్యాలీ ఎంతో దోహదపడుతుందని ఎంపీ తేజస్వి సూర్య అన్నారు . భారత ప్రధానమంత్రి నరేంద్రమోడీ గారి పిలుపుమేరకు ఆజాదీకా అమృత మహోత్సవ్ కార్యక్రమాల్లో భాగంగా సి ఆర్ పి ఎస్ వారు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దాకా ఈ సైకిల్ ర్యాలీ నిర్వహించడం ఎంతో అభినందనీయం అన్నారు.సీఆర్ పీ ఎఫ్ అదనపు డీజీ రష్మి శుక్ల, ఐజీపీలు మహేష్ చంద్ర లడ్డా, గిరిప్రసాద్ తదితర ఉన్నతాధికారులు అజాదీ కా అమృతొత్సవ్ సైకిల్ ర్యాలీలో పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here