బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి కళ్యాణం ఏర్పాట్లు ప‌రిశీలించిన మంత్రి

0
114
Spread the love

బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి కళ్యాణం ఏర్పాట్లు ప‌రిశీలించిన మంత్రి

ఎంతో మహిమ కలిగిన బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి కళ్యాణం నిర్వహణ కు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. మంగళవారం జరగనున్న బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణం ఏర్పాట్లను ఆయన సోమవారం మధ్యాహ్నం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉదయం 9 గంటల నుండే ఎల్లమ్మ అమ్మవారి కళ్యాణం కు సంబంధించిన పూజా కార్యక్రమాలు ప్రారంభం అవుతాయని, 11.30 గంటలకు అమ్మవారి కళ్యాణం ఆలయం బయట షెడ్డు క్రింద నిర్వహించడం జరుగుతుందని చెప్పారు. అమ్మవారి కళ్యాణానికి నగరం నుండే కాకుండా ఇతర ప్రాంతాల నుండి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో వస్తారని, దానిని దృష్టిలో ఉంచుకొని అందుకు అనుగుణంగా భక్తులు ఎలాంటి అసౌకర్యానికి గురికాకుండా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు. కరోనా నేపధ్యంలో అన్ని జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు మాస్క్ లు, శాని టైజర్ లను అందుబాటులో ఉంచుతున్నట్లు చెప్పారు. గత సంవత్సరం కరోనా మహమ్మారి కారణంగా అమ్మవారి కళ్యాణాన్ని ఆలయం లోపల నిరాడంబరంగా నిర్వహించిన విషయాన్ని గుర్తుచేశారు. ఈ సంవత్సరం ఎంతో ఘనంగా నిర్వహించాలన్న ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ప్రభుత్వం అన్ని శాఖల సహకారంతో రకాల ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. అమ్మవారి కళ్యాణాన్ని TV లలో ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించేలా ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. ఆలయ పరిసరాలలో భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ట్రాపిక్ డైవర్షన్ చేయడం జరుగుతుందని, ప్రజలు కూడా సహకరించాలని కోరారు. మంత్రి వెంట జోనల్ కమిషనర్ DC వంశీ, EO అన్నపూర్ణ, వాటర్ వర్క్స్ GM హరిశంకర్, R & B EE రవీంద్ర మోహన్, SPHO రేవతి, పోలీస్, ట్రాపిక్ పోలీసు అధికారులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here