ఎంపీ సోయం బాపురావు ఆరెస్ట్ ను ఖండించిన – బండి

0
45
Spread the love

ఎంపీ సోయం బాపురావు గారి ఆరెస్ట్ ను ఖండించిన – బండి

ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు ఆరెస్ట్ ను ఖండించారు బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు బండి సంజ‌య్‌. బీజేపీ రాష్ట్ర కార్యాల‌యంలో ఏర్పాటు చేసిన విలేక‌రుల స‌మావేశంలో ఆయ‌న మాట్లాడుతూ…. నిర్మల్ జిల్లా మన్మధ దగ్గర బీజేపీ కార్యకర్తల కాళ్ళ పైకీ పోలీసులు కారు తోలడం దూర్మార్గమ‌న్నారు. బాసర ట్రిపుల్ ఐటీ సమస్యను ముఖ్యమంత్రి పట్టించుకోలేదని విమ‌ర్శించారు. విద్యార్థులు సంయమనంతో వ్యవహరించారన్నారు. ప్రభుత్వం, ముఖ్యమంత్రి మొద్దు నిద్రలో ఉన్నారు అని తెలిసి విద్యార్థులు ప్రజాస్వామ్యయుతంగా నిరసన కార్యక్రమం చేపట్టారని వివ‌రించారు. విద్యార్థుల ఆందోళన ను కించపరిచేలా మంత్రులు మాట్లాడుతున్నారని విమ‌ర్శించారు. నేను వెళ్తే కూడా అరెస్టు చేశారన్నారు. ముఖ్యమంత్రి, ఆయన కుటుంబం ఎక్కడికీ పోయింది అంటూ తెలంగాణ ప్రజలు అడుగుతున్నారని చెప్పారు. బాసర ట్రిపుల్ ఐటీ లో విద్యార్థులను పరామర్శించేందుకు సోయం బాబురావు వెళ్తుంటే స్థానిక పార్లమెంటు సభ్యుడిని అడ్డుకోవడం లో ఉన్న అంతర్యం ఏమిటని ప్ర‌శ్నించారు. సోయం బాబూరావు ను ఎందుకు అరెస్టు చేసారో ముఖ్యమంత్రి సమాధానం చెప్పాల‌న్నారు. చిన్నసమస్యలు కూడా పరిష్కారించలేని దీనావస్థలో కేసీఆర్ ఉన్నాడని ఎద్దేవా చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here