పల్లివాడ లో ర‌క్షాబంధ‌న్ సంబురాల్లో పాల్గొన్న బండి సంజ‌య్‌

0
77
Spread the love

పల్లివాడ ప్రజలందరికీ రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు బండి సంజ‌య్‌. పల్లివాడ స్టేజ్, నకిరేకల్ నియోజకవర్గంలో ఆయ‌న పాద‌యాత్ర కొనసాగుతోంది. ఈ సంద‌ర్భంగా ఆయ‌న‌ ప్ర‌సంగిస్తూ “రక్షాబంధన్ సంబరాల్లో పాల్గొన్నారు. స్థానిక మ‌హిళ‌ల‌తో రాఖీ క‌ట్టించుకోవ‌డం అదృష్టంగా భావిస్తున్నాన‌ని పేర్కొన్నారు. మా ఇళ్లల్లో కూడా అక్కా చెల్లెలు ఉన్నారు. వాళ్లకు చెప్పే వచ్చాము మీతో ఈ పండుగ జరుపుకుంటామని..ఎండలు, వానలు, పండుగలు అని పాదయాత్ర నుంచి పారిపోయే రకం కాదు మేము. పోయినసారి పాదయాత్రలోనే అందరి సమక్షంలో ‘వినాయక చవితి’ జరుపుకున్నాం. సృష్టికి మూలం స్త్రీలే. అన్నింటిలో మాత(భూమాత, గోమాత, భారత్ మాత, గోదావరి మాత, అగ్నిమాత) నే తలుచుకుంటాం. వీళ్లందరినీ స్త్రీ తోనే పోలుస్తాం. దేవతలు, మాతృ స్వరూపులు మాత్రమే మనకి కనిపిస్తారు. మహిళలకు రాజకీయపరంగా… పార్టీ పరంగా ప్రధాని మోదీ అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారు.
మహిళా సాధికారతకు మోదీ పెద్దపీట వేస్తున్నారు. “భేటీ బచావో…బేటి పడావో”… పేరుతో కార్యక్రమాలను ప్రారంభించారు. 4 గురు మహిళలను సీఎం లను చేశాం…6 గురు మహిళలను గవర్నర్ లను చేశాం.. 12 మంది మహిళా ఎంపీ లను మంత్రులను చేశాం. చివరికి దేశ అత్యున్నత పీఠంపై ఎస్టీ మహిళను రాష్ట్రపతిగా కూర్చోబెట్టాం. భారతీయ జనతా పార్టీలో కమిటీల నియామకం లో మహిళలకు 30 శాతం రిజర్వేషన్లు కల్పిస్తున్నాం. మహిళలను పారిశ్రామిక వేత్తలుగా తీర్చిదిద్దేందుకు మహిళలకు ‘ముద్రా లోన్లుస‌ ఇస్తున్నాం. మహిళలకు ప్రాముఖ్యతను, ప్రాధాన్యతను ఇచ్చే పార్టీ భారతీయ జనతా పార్టీ. నువ్వు మాకు రక్ష, నేను మీకు రక్ష… మనమంతా దేశానికి రక్ష” అని పేర్కొన్నారు..పల్లివాడ ప్రజలందరినీ ఎప్పటికీ మర్చిపోను. అమ్మ వారి ఆశీస్సులతో మీరందరూ నిత్యం సుఖసంతోషాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని అమ్మవారిని ప్రార్థిస్తున్నా. ‘జై భారత్ మాత’ అని తన ప్రసంగాన్ని ముగించారు బండి సంజయ్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here